ఉక్రెయిన్, రష్యా వార్: చాలా ఎక్సయిటింగ్గా ఉన్నా

ఉక్రెయిన్, రష్యా వార్: చాలా ఎక్సయిటింగ్గా ఉన్నా

మాస్కో: ఉక్రెయిన్‎పై రష్యా యుద్దం ప్రకటించింది. మిలటరీ వార్ మొదలుపెట్టినట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. దాంతో రష్యా బలగాలు ఉక్రెయిన్ రాజధాని కీవ్‎పై బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన కామెంట్లు వివాదాస్పదంగా మారాయి. రష్యా పర్యటనలో ఉన్న ఇమ్రాన్ ఈ యుద్ధం గురించి మాట్లాడుతూ.. ‘నేను సరైన సమయానికి ఇక్కడకు వచ్చాను. నేను చాలా ఉత్సుకతతో ఉన్నా’ అని చెప్పారు. మాస్కోకు రావడం తనకు సంతోషాన్ని కలిగించిందని ఇమ్రాన్ అన్నట్లు తెలుస్తోంది. 

కాగా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశమై ఆర్థిక సహకారంతో సహా పలు అంశాలపై చర్చించేందుకు పాక్ ప్రధాని బుధవారం మాస్కో వెళ్లారు. ఇది కాకుండా, ఎజెండాలో రెండు దేశాలు, తాలిబాన్ నియంత్రిత ఆఫ్ఘనిస్తాన్, ప్రాంతీయ భద్రతా సహకారంలో వారి పరస్పర ఆందోళనలు కూడా ఉన్నాయి. గత ఇరవై ఏళ్లలో మాస్కోను సందర్శించిన పాక్ ప్రధాని ఇమ్రాన్ కావడం గమనార్హం. ఇమ్రాన్ ఖాన్ రష్యా పర్యటనపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. ఉక్రెయిన్ లో రష్యా చర్యలకు అభ్యంతరం చెప్పా్ల్సిన బాధ్యత ప్రతి దేశం పైనా ఉందని యూఎస్ అధికార ప్రతినిధి నెడ్ ప్రైస్ తెలిపారు. బాధ్యతాయుతమైన ఏ దేశమైనా రష్యా చర్యలకు వ్యతిరేకంగా గళం విప్పాలని పేర్కొన్నారు. యుద్ధాన్ని ఆపేందుకు దౌత్యపరంగా తాము చేస్తున్న ప్రయత్నాలను పాక్ కు తెలియజేశామని చెప్పారు. 

మరిన్ని వార్తల కోసం:

ఉక్రెయిన్‎పై రష్యా యుద్ధం.. లైవ్ అప్‎డేట్స్

రైతులు చస్తున్నా కేసీఆర్కు పట్టించుకునే తీరికలేదు

సైన్యం పరంగా... రష్యా బలమైందా? ఉక్రెయినా?