మూడో పెళ్లి చేసుకున్న ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య

మూడో పెళ్లి చేసుకున్న ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య

పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రెహమ్ ఖాన్ మూడో పెళ్లి చేసుకున్నారు. నటుడు, మోడల్ మీర్జా బిలాల్‌ బేగ్ ను తాను వివాహం చేసుకున్నట్లుగా ఆమె తెలిపారు. చివరకు నేను విశ్వసించే వ్యక్తి నాకు దొరికాడు  అంటూ ఆమె తన ఇన్ స్టాలో పేర్కొంది. ఆమెరికాలోని సియాటిల్‌లో వీరి వివాహం జరిగింది. అయితే రెహమ్ ఖాన్  కంటే బిలాల్‌ బేగ్ 13 ఏళ్లు చిన్నవాడు. 

కాగా ఇమ్రాన్ ఖాన్ తో 2015లో రెహమ్ ఖాన్ పెళ్లి అయింది. కేవలం 10 నెలల తరువాత వీరిద్దరూ విడిపోయారు. అంతకుముందు రెహమ్ ఖాన్ కు 1993లో తన బంధువైన ఇజాజ్ రెహ్మాన్ తో వివాహం జరిగింది. 2005లో అతని నుంచి రెహమ్ ఖాన్ విడాకులు తీసుకుంది. అటు ఇమ్రాన్ ను ఇంటర్వ్యూ చేసిన టైమ్ లో రెహమ్ ఖాన్ తో మీర్జా బిలాల్‌ బేగ్ కు పరిచయం ఏర్పడింది.