6 రోజుల్లో రూ. 1,800 తగ్గిన గోల్డ్‌‌‌‌ రేటు

6 రోజుల్లో రూ. 1,800 తగ్గిన గోల్డ్‌‌‌‌ రేటు

6 రోజుల్లో రూ. 1,800 తగ్గిన గోల్డ్‌‌‌‌ రేటు
డాలర్ బలపడడం, యూఎస్ బాండ్‌‌‌‌‌‌‌‌ ఈల్డ్‌‌‌‌‌‌‌‌లు పెరగడమే కారణం

న్యూఢిల్లీ : దేశంలో గోల్డ్ రేట్లు వరసగా ఆరో రోజు కూడా తగ్గాయి. యూఎస్ డాలర్, బాండ్ ఈల్డ్‌‌‌‌లు పెరగడంతో  గోల్డ్‌‌‌‌పై ఒత్తిడి పెరుగుతోంది. దేశ ఎంసీఎక్స్ మార్కెట్‌‌‌‌లో, 10 గ్రాముల గోల్డ్ (ఫ్యూచర్స్‌‌‌‌) సోమవారం 0.75 % తగ్గి రూ. 51,874 వద్ద ట్రేడవుతోంది.  సిల్వర్ (కేజీ) 1.3 % తగ్గి రూ. 65,745 దగ్గర ట్రేడవుతోంది. గత ఆరు రోజుల్లో  10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 1,800 తగ్గింది. ఇంటర్నేషనల్ మార్కెట్‌‌‌‌లో  గోల్డ్‌‌‌‌  రేటు రెండు వారాల కనిష్టానికి పడిపోయింది. స్పాట్ గోల్డ్ రేటు (ఔన్సు) 1,928.08 డాలర్ల దగ్గర ట్రేడవుతోంది. ఏప్రిల్‌‌‌‌ 7 తర్వాత గోల్డ్‌‌‌‌కు ఇదే తక్కువ లెవెల్. డాలర్ ఇండెక్స్‌‌‌‌  101.265 కు పెరిగింది.  ఇతర మేజర్ కరెన్సీలతో పోలిస్తే డాలర్ బలపడుతుండడంతో,  ఇతర  కరెన్సీల్లో గోల్డ్ కొనేవారిపై భారం పెరుగుతోంది. దీంతో గోల్డ్‌‌‌‌ కు డిమాండ్ తగ్గుతోంది.

మరిన్ని వార్తల కోసం..

కరీంనగర్​ యువ ఇంజినీర్ ​ప్రతిభ

టీఆర్ఎస్ ప్లీనరీకి పకడ్బందీ ఏర్పాట్లు