ఇండియన్ రైల్వే కొత్త పాలసీ..ఇకపై బుక్ చేసుకున్న టికెట్ తేదీలను ఈజీగా మార్చుకోవచ్చు..

ఇండియన్ రైల్వే కొత్త పాలసీ..ఇకపై బుక్ చేసుకున్న టికెట్ తేదీలను ఈజీగా మార్చుకోవచ్చు..

ఇండియన్ రైల్వే ప్రయాణికులకు ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై, మీ జర్నీ ప్లాన్లు అనుకోకుండా మారినా, చార్జీలు లేకుండా టికెట్ తేదీని మార్చుకోవడం సులభం కానుంది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్  ప్రకారం, జనవరి నుంచి ప్రయాణికులు కన్ఫర్మ్  రైలు టికెట్ ప్రయాణ తేదీని ఆన్‌లైన్‌లో ఎటువంటి ఫీజు లేకుండా మార్చుకోవచ్చు అని చెప్పారు. 

ప్రస్తుతం ఉన్న విధానంలో, ప్రయాణ తేదీ మార్చుకోవాలంటే పాత టికెట్‌  క్యాన్సల్  చేసుకుని, కొత్త టికెట్‌ బుక్ చేసుకోవాలి. క్యాన్సల్   ఎప్పుడు చేశారనే దాన్ని బట్టి  కొంత ఛార్జ్ పడుతుంది. ఈ పద్ధతి చాలా ఇబ్బందిగా ఉండేది. ఈ పాత విధానం అన్యాయంగా ఉందని, ప్రయాణికులకు లాభదాయకంగా లేదని వైష్ణవ్ అన్నారు. ప్రయాణికులకు అనుకూలంగా కొత్త మార్పులు తీసుకురావాలని అధికారులకి ఆదేశాలు ఇచ్చామని ఆయన చెప్పారు.

ALSO READ : ఉదయాన్నే వేడి నీళ్లు తాగటం వల్ల వచ్చే ప్రయోజనాలు ఇవే..

అయితే, కొత్త తేదీకి కూడా కన్ఫర్మ్ టికెట్ ఖచ్చితంగా వస్తుందనే గ్యారెంటీ లేదని రైల్వే మంత్రి స్పష్టం చేశారు. ఎందుకంటే అది సీట్ల లభ్యతపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ కొత్త టికెట్ ధర ఎక్కువ ఉంటే, ఆ మొత్తాన్ని ప్రయాణికులు కట్టాల్సి  ఉంటుంది. రైలు ప్రయాణాలను మార్చుకోవాల్సిన అవసరం ఉన్నా, ప్రస్తుతం భారీగా క్యాన్సల్ చార్జీలు కట్టాల్సి వస్తున్న లక్షలాది మంది ప్రయాణికులకు ఈ మార్పు చాలా ఉపయోగపడుతుంది.

ఇప్పుడు ఉన్న నిబంధనల ప్రకారం, రైలు బయలుదేరడానికి 48 గంటల నుండి 12 గంటల ముందు టికెట్ క్యాన్సల్  చేస్తే, టికెట్ ధరలో 25 శాతం ఛార్జ్ పడుతుంది. బయలుదేరడానికి 12 మరియు 4 గంటల ముందు క్యాన్సల్  చేస్తే, ఈ ఛార్జ్ ఇంకా పెరుగుతుంది. రిజర్వేషన్ చార్ట్ తయారైన తర్వాత టికెట్ క్యాన్సల్  చేస్తే, డబ్బులు రీఫండ్  రాదు.