
చాల మందికి పొద్దున్నే లేవగానే నీళ్లు తాగుతుంటారు. ఈ అలవాటు అందరికి లేకపోయినా కొందరికి తప్పకుండ ఉంటుంది. వీరిలో కొందరైతే గోరువెచ్చని నీళ్లు తాగుతుంటారు. అయితే ఈ గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల మన శరీరానికి ఎంతో గొప్ప మేలు జరుగుతుంది.
కాలేయం: నీటిని మరిగించి గోరు వెచ్చగా అయ్యాక తాగితే శరీరంలో ఉన్న విష పదార్ధాలు బయటకు వెళ్లిపోతాయి. దింతో కాలేయం పై ఒత్తిడి తగ్గుతుంది. లివర్ ఫంక్షన్ మెరుగుపడుతుంది.
జీర్ణక్రియ: మరిగించిన నీటిని తాగడం వల్ల తిన్న ఆహరం మంచిగా జీర్ణం అవుతుంది. కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలు తగ్గిపోతాయి.
గుండె ఆరోగ్యం: గోరువెచ్చని నీళ్లు తాగితే రక్తనాళాలు వ్యాకోచిస్తాయి. రక్తప్రసరణ బాగా జరుగుతుంది. దింతో గుండెకు రక్త ప్రసరణ బాగా హృదయ సంబంధ సమస్యలు రాకుండా ఉంటాయి.
గొంతు నొప్పి: గోరువెచ్చని నీటిని తాగితే గొంతు నొప్పి, జలుబు, దగ్గు వంటి సమస్యలు నుంచి ఉపశమనం కలుగుతుంది. తరచూ గొంతు సమస్యలతో బాధపడేవారు గోరువెచ్చని వాటర్ తాగడం మంచిది.
బరువు: ప్రతిరోజు లేవగానే గోరువెచ్చని నీళ్లు తాగితే మెటబాలిజం వేగవంతంగా మారుతుంది. కొవ్వు కరుగుతుంది. దింతో సులువుగా బరువు తగ్గొచ్చు.
చర్మ కాంతివంతం: గోరువెచ్చని నీటిని తాగడం వల్ల చర్మానికి తేమ వస్తుంది. చర్మం మృదువుగా, అందంగా , కాంతివంతంగా మారుతుంది.
మలబద్దకం: గోరువెచ్చని నీళ్లు తాగితే పేగులో కండరాళ్ళ కదలికలు బాగుంటాయి. అలాగే మలబద్దకం సమస్య తగ్గుతుంది. మలబద్దకం బాధపడేవారు ఈ నీళ్లు తాగడం మంచిది.
ALSO READ : జొన్నలు, సజ్జలు లేదా రాగి, ఏ రోటీలు మీ ఆరోగ్యానికి మంచివి..?
ఇమ్మ్యూనిటి: గోరువెచ్చని నీరు తాగడం వల్ల ఇమ్మ్యూనిటి పెరుగుతుంది. రకరకాల ఇన్ఫెక్షన్లు నుండి దూరంగా ఉండోచ్చు. ముఖ్యంగా సీజనల్ వ్యాధులు రాకుండా చూసుకోవచ్చూ.
తలనొప్పి : గోరువెచ్చని నీళ్లు తాగితే ముక్కు దిబ్బడ, సైనస్, తలనొప్పి వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. ఈ సమస్యలతో బాధపడేవారు గోరువెచ్చని నీరు తాగడం మంచిది.