జొన్నలు, సజ్జలు లేదా రాగి, ఏ రోటీలు మీ ఆరోగ్యానికి మంచివి..? డాక్టర్లు ఎం చెబుతున్నారంటే..?

జొన్నలు, సజ్జలు లేదా రాగి, ఏ రోటీలు మీ ఆరోగ్యానికి మంచివి..?  డాక్టర్లు ఎం చెబుతున్నారంటే..?

రోటీలు మన దేశ వంటకాల్లో ఒక ముఖ్యమైనది. వాటిలో కార్బోహైడ్రేట్లు అంటే నెమ్మదిగా జీర్ణమయ్యేవి, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. మనం ప్రతిరోజు రోటీలు తింటూనే ఉంటాం, కానీ ఒక్కో రకమైన రోటీకి ఒక్కో ప్రత్యేక ప్రయోజనం ఉందని మీకు తెలుసా ?  

ఈ రోజుల్లో చాలా మంది ఆరోగ్య నిపుణులు రోటీలు తినడం ఆపేయండి అంటూ చెప్పడం వింటూ ఉంటారు. కానీ, మన దేశ భోజనంలో ఇంత ముఖ్యమైన దాని వదులుకోవడం అంతఈజీ కాదు. మన దేశంలో చాలా మంది ఎక్కువగా గోధుమ రోటీ తింటారు. అయితే గోధుమ రోటీ కొన్నిసార్లు రక్తంలో చక్కెరను పెంచవచ్చు ఇంకా బరువు పెరగడానికి కూడా కారణం కావచ్చు.  

మీ ఆరోగ్యానికి ఏ రోటీలు మంచివి అంటే ?
 జొన్న రోటి: మధుమేహం/ షుగర్ ఉన్నవారికి లేదా అధిక బరువు గురించి ఆందోళన చెందుతున్నవారికి జొన్న రోటి ఒక గొప్ప అప్షన్. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి, గ్లూటెన్ ఉండదు, ఫైబర్ ఎక్కువగా  ఉంటుంది. జొన్న రోటి తినడం వల్ల పేగు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.

బజ్రా రోటీ: పెర్ల్ మిల్లెట్ లేదా బజ్రా రోటీలో ఐరన్, ఫైబర్, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది షుగర్ ఉన్నవారికి అలాగే బరువు తగ్గడానికి లేదా కండరాలు బలంగా ఉండాలని కోరుకునే వారికీ బెస్ట్. 

ఓట్స్ రోటీ: ఓట్స్ తో చేసిన రోటీలు డైటరీ ఫైబర్, బీటా-గ్లూకాన్ తో నిండి ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది ఇంకా కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.

రాగి రోటీ: రాగి రోటీలలో కాల్షియం, ఐరన్ అధికంగా ఉంటాయి. ఈ రోటీలు ఎముకలను దృడంగా  చేయడం, హిమోగ్లోబిన్ లెవెల్స్ పెంచడానికి సప్లిమెంట్‌గా పనిచేస్తాయి.

►ALSO READ | ఈ ఆదివారం అదరగొడదామా : రొయ్యలతో ఘుమఘుమలాడే కర్రీలు.. ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి..!