చిటికెలో.. మీ లైఫే రిస్కు‌‌లో పడొచ్చు

చిటికెలో.. మీ లైఫే రిస్కు‌‌లో పడొచ్చు

కలిసి సాగుదాం.. మంచిగ బతుకుదాం
అమెరికాలో బ్లాక్ యువకుడి వీడియో మెసేజ్ వైరల్
పోలీసు కాల్పుల్లో గాయాలు.. హాస్పి టల్ బెడ్ నుంచే సందేశం

వాషింగ్టన్: ‘‘మీ లైఫ్.. కేవలం మీ లైఫ్ మాత్రమే కాదు.. బయటి ప్రపంచంలో తిరిగేందుకు, జీవితం లో ముందుకు వెళ్లేందుకు అవసరమైన మీ కాళ్లను.. ఇలా జస్ట్ ఒక చిటికెలో తీసుకోవచ్చు.. జీవితంలో ఏదైనా ఇలా చిటికెలో మారిపోవచ్చు..’’ అంటూ అమెరికాలో పోలీసు కాల్పుల్లో గాయపడి దవాఖాన పాలైన ఓ బ్లాక్ యువకుడు పెట్టిన వీడియో మెసేజ్ వైరల్ అయింది. జాకబ్ బ్లేక్ అనే 29 ఏళ్ల బ్లాక్ యువకుడు గ్రీన్ గౌన్ తో హాస్పిటల్ బెడ్ పై నుంచి తన సపోర్టర్లను ఉద్దేశించి మాట్లాడుతుండగా తీసిన వీడియోను అతని అడ్వకేట్ బెన్ క్రంప్ ట్వీట్ చేశారు. గంటల్లోనే ఈ వీడియోకు 4 లక్షల వ్యూస్ దాటాయి. ‘‘24 గంటలూ నొప్పి. నొప్పి తప్ప ఇంకేం లేదు. ఊపిరి తీసుకోలేకపోతున్నా. నిద్ర పోలేకున్నా. పక్కకు తిరిగి పడుకోవాలన్నా నొప్పి చంపేస్తోంది. చివరికి ఆకలైనా.. నొప్పివల్ల ఏమీ తినలేకపోతున్నా’’ అంటూ తనకు జరిగిన దారుణాన్ని అతడు వివరించాడు. ‘‘నడుము నుంచి కిందికి చచ్చుబడిపోయినా, నాకు ఇంకా బతకడానికి ఎంతో జీవితం ఉంది. ప్లీజ్.. మీ జీవితాలను మార్చుకోండి. కలిసికట్టుగా సాగుదాం. సంపాదించుకుందాం. మంచిగ బతుకుదాం. ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేసుకున్నాం’’ అంటూ బ్లేక్ నల్లజాతీయులకు పిలుపునిచ్చాడు.

ఏం జరిగిందంటే..

కెనోషా సిటీకి చెందిన జాకబ్ బ్లేక్ పెయింటర్. బ్లేక్‌‌పై ఆయన మాజీ భార్య క్రిమినల్ కేసు పెట్టింది. ఈ క్రమంలో ఆగస్టు 23న కారులోకి ఎక్కేందుకు ప్రయత్నిస్తున్న బ్లేక్‌‌ పై ఒక పోలీస్‌‌ ఆఫీసర్ ఏడు సార్లు పిస్టల్‌‌తో కాల్చాడు. దీంతో జాకబ్ నడుము, పొట్ట దగ్గరి నుంచి కింది వరకు బుల్లెట్లు తగిలాయి. దీంతో జాకబ్‌‌ బ్లేక్‌‌ నడుము కింది భాగమంతా
చచ్చుబడిపోయింది.