శ్రీనివాస్ గౌడ్ పై కేసీఆర్ చర్యలు తీసుకోవాలె

శ్రీనివాస్ గౌడ్ పై కేసీఆర్ చర్యలు తీసుకోవాలె
  • బీజేపీ నేత డీకే అరుణ డిమాండ్‌‌

హైదరాబాద్, వెలుగు: బహిరంగంగా గాల్లోకి కాల్పులు జరిపిన మంత్రి శ్రీనివాస్ గౌడ్‌‌ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ శనివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. జిల్లా ఎస్పీనే తనకు స్వయంగా తుపాకీ ఇచ్చారని మంత్రి చెప్తున్నారని, అధికార దుర్వినియోగానికి పాల్పడిన సదరు ఎస్పీని కూడా సస్పెండ్ చేయాలని కోరారు. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉండి ఇలాంటి చర్యలకు పాల్పడిన శ్రీనివాస్ గౌడ్‌‌పై సీఎం కేసీఆర్ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.