AP Budget : ఏపీ బడ్జెట్.. సంక్షేమ పథకాలకే పెద్దపీట

AP Budget : ఏపీ బడ్జెట్.. సంక్షేమ పథకాలకే పెద్దపీట

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లోలో జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ లో పేదలకు అండగా నిలిచే సంక్షేమ పథకాలకే అధిక ప్రాధాన్యం ఇచ్చింది. ముందుగా పోతన పద్యంతో బడ్జెట్ ప్రసంగాన్ని మొదలుపెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన రాంజేంద్రనాథ్ రెడ్డి.. మొత్తం రూ.2,79,279 కోట్లను బడ్జెట్లో ప్రవేశపెట్టారు. అందులో రెవున్యూ వ్యయం రూ.2,28,540 కోట్లు కాగా మూలధన వ్యయం రూ. 31,061 కోట్లుగా ఉన్నాయి. ఏపీ బడ్జెట్లో సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వ కేటాయింపులు ఇలా ఉన్నాయి..

బడ్జెట్ ముఖ్యాంశాలు : 

  • రూ.2.79 లక్షల కోట్ల అంచనాలతో ఏపీ బడ్జెట్
  • ఆర్థిక శాఖకు రూ.72,424 కోట్లు కేటాయింపు
  • వైద్య, ఆరోగ్య శాఖకు రూ.15,882 కోట్లు
  • వ్యవసాయ రంగానికి రూ.11,589 కోట్లు
  • పశుసంవర్ధక శాఖకు రూ.1787 కోట్లు
  • బీసీ సంక్షేమ శాఖకు రూ.23,509 కోట్లు
  • పర్యావరణానికి రూ.685 కోట్లు
  • జీఏడీకి రూ.1418 కోట్లు కేటాయింపు
  • హోంశాఖకు రూ.8206 కోట్లు కేటాయింపు
  • గృహనిర్మాణ శాఖకు రూ.6292 కోట్లు
  • గ్రామ, వార్డు సచివాలయాలకు రూ.3858 కోట్లు
  • నీటిపారుదల రంగానికి రూ.11,908 కోట్లు
  • పరిశ్రమలు, వాణిజ్యం రూ.2602 కోట్లు
  • మౌలిక వసతులు, పెట్టుబడులకు రూ.1295 కోట్లు
  • కార్మిక శాఖకు రూ.796 కోట్లు,
  • ఐటీ శాఖకు రూ.215 కోట్లు
  • న్యాయశాఖకు రూ.1058 కోట్లు కేటాయింపు
  • స్త్రీ, శిశు సంక్షేమం రూ.3951 కోట్లు
  • బీసీ కార్పొరేషన్‌కు రూ.22,715 కోట్లు
  • ఎస్పీ కార్పొరేషన్‌కు రూ.8384.93 కోట్లు
  • ఎస్టీ కార్పొరేషన్‌కు రూ.2428 కోట్లు
  • ఈబీసీ కార్పొరేషన్‌కు రూ.6165 కోట్లు
  • కాపు కార్పొరేషన్‌కు రూ.4887 కోట్లు
  • క్రిస్టియన్ కార్పొరేషన్‌కు రూ.115.03 కోట్లు
  • బ్రాహ్మణ కార్పొరేషన్ రూ.346.78 కోట్లు
  • మైనారిటీ కార్పొరేషన్‌కు రూ.1868.25 కోట్లు కేటాయింపు
  • యూత్, టూరిజం రూ.291 కోట్లు
  • డీబీటీ స్కీమ్‌లకు రూ.54,228.36 కోట్లు కేటాయింపు
  • పెన్షన్లు రూ.21,434 కోట్లు
  • రైతు భరోసాకు రూ.4020 కోట్లు
  • జగనన్న విద్యా దీవెనకు రూ.2842 కోట్లు
  • వసతి దీవెనకు రూ.2200 కోట్లు
  • వైఎస్సార్ పీఎమ్ బీమా యోజనకు రూ. 700 కోట్లు
  • అసెంబ్లీ, సెక్రటేరియట్‌ రూ.111 కోట్లు
  • పట్టణాభివృద్ధికి రూ.9381 కోట్లు కేటాయింపు
  • మైనార్టీ సంక్షేమానికి రూ.2240 కోట్లు కేటాయింపు
  • నగదు బదిలీ పథకాలకు రూ.54 వేల కోట్లు
  • ఇంధన శాఖకు రూ. 6546 కోట్లు కేటాయింపు
  • అగ్రవర్ణ పేదల సంక్షేమానికి రూ. 11,085 కోట్లు
  • సివిల్ సప్లై - రూ. 3725 కోట్లు, జీఏడీకి రూ.1,148 కోట్లు
  • పబ్లిక్ ఎంటర్‌ ప్రైజెస్ రూ.1.67 కోట్లు, ప్రణాళిక 809 కోట్లు
  • రెవెన్యూ రూ.5380 కోట్లు, రియల్ టైం గవర్నెస్ రూ.73 కోట్లు
  • స్కిల్‌డెవలప్‌మెంట్‌కు రూ. 1167 కోట్లు
  • సాంఘిక సంక్షేమం రూ.14511 కోట్లు, R&Bకి రూ.9119 కోట్లు
  • డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలు రూ.300 కోట్లు
  • రైతులకు వడ్డీ లేని రుణాలకు రూ.500 కోట్లు
  • కాపు నేస్తం రూ.550 కోట్లు
  • జగనన్న చేదోడుకు రూ.350 కోట్లు
  • వాహనమిత్ర రూ.275 కోట్లు
  • నేతన్న నేస్తం రూ.200 కోట్లు
  • మత్స్యకార భరోసా రూ.125 కోట్లు
  • మత్స్యకారులకు డీజిల్ సబ్సిడి రూ.50 కోట్లు
  • ఈబీసీ నేస్తం రూ.610 కోట్లు
  • వైఎస్సార్ కళ్యాణమస్తు రూ.200 కోట్లు
  • వైఎస్సార్ ఆసరా రూ.6700కోట్లు
  • వైఎస్సార్ చేయూత రూ.5000 కోట్లు
  • అమ్మఒడి రూ.6500 కోట్లు