
బిహార్ రాష్ట్రం నలంద జిల్లాలో ఇద్దరు పోలీసులు నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే కొట్టుకున్నారు. లంచం విషయంలో తలెత్తిన వివాదం... ఇద్దరి మధ్య గొడవకు దారి తీసింది. లంచంగా వచ్చిన మొత్తాన్ని పంచుకునే విషయంలో ఇద్దరు పోలీసుల మధ్య విభేదం తలెత్తింది. ఈ వీడియోను కొందరు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్‌గా మారింది.
నలందలోని ఓ రహదారిపై పోలీసులు తమ వాహనం ఆపారు. రోడ్డు పక్కన ఇద్దరు పోలీసులు గొడవ పడ్డారు. ఇద్దరూ ఖాకీ చొక్కాలు పట్టుకొని మరీ ఒకరినొకరు తోసుకున్నారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వారి చుట్టూ గుమిగూడారు.
ఉన్నతాధికారులకు విషయం తెలిస్తే మిమ్మల్ని సస్పెండ్ చేస్తారని స్థానికులు హెచ్చరించినా ఆ ఇద్దరు పోలీసులు పట్టించుకోలేదు. ఈ ఘటనను అక్కడే ఉన్న కొంతమంది.. వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అవి వైరల్‌గా మారాయి.
ఈ ఘటనపై నలంద జిల్లా పోలీస్ శాఖ స్పందించింది. ఇద్దరు పోలీసులను పోలీస్ సెంటర్‌కు పిలిపించినట్లు తెలిపింది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని.. ఇద్దరు పోలీసులపై క్రమ శిక్షణ చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.
बिहार पुलिस के जवान आपस में हिसाब-किताब करते हुए, नालंदा का वीडियो. pic.twitter.com/8KWlChndwl
— Utkarsh Singh (@UtkarshSingh_) September 18, 2023