- ఇన్‌చార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్
రాజన్న సిరిసిల్ల, వెలుగు: వానాకాలం సీజన్‌లో వడ్ల కొనుగోళ్ల ప్రక్రియను సజావుగా పూర్తిచేయాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరిమా అగర్వాల్అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలపై వివిధ శాఖల అధికారులతో కలెక్టరేట్‌లో శుక్రవారం రివ్యూ మీటింగ్నిర్వహించారు. పంటల దిగుబడిని జిల్లా వ్యవసాయ అధికారిని అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో 238 కొనుగోలు కేంద్రాలు మంజూరు చేయగా, ఇప్పటివరకు 171 ప్రారంభించినట్లు చెప్పారు.
ఈ ఏడాది దాదాపు 4.50లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. అన్ని కొనుగోలు కేంద్రాల్లో ప్యాడీ క్లీనర్లు, టార్పాలిన్లు, టెంట్లు, నీటివసతి, విద్యుత్ వసతి పక్కాగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లాలో పత్తి కొనుగోళ్లకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పక్కాగా చేయాలన్నారు. రైతులకు కపాస్ కిసాన్ యాప్ పై అవగాహన కల్పించాలని ఆదేశించారు. మీటింగ్‌లో అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేశ్, డీఆర్డీవో శేషాద్రి, డీసీఎస్‌వో చంద్ర ప్రకాశ్, డీఏవో అఫ్జల్ బేగం, డీసీవో రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.
