"ప్రమాదకర" వ్యాజ్యం గురించి మాకు చెప్పలేదు

"ప్రమాదకర" వ్యాజ్యం గురించి మాకు చెప్పలేదు

వాషింగ్టన్​: ట్విటర్​ను కొనాలన్న ఆలోచ నను చివర్లో విరమించుకొని కేసులో ఇరుక్కున్న టెస్లా చీఫ్​ ఎలాన్​ మస్క్​ ఆ సంస్థపై అమెరికా కోర్టులో కంప్లయింట్​ చేశారు. ఇండియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేసిన "ప్రమాదకర" వ్యాజ్యం గురించి తమకు చెప్పలేదని ఆరోపించారు. ఇలా చేయడం ద్వారా మూడో అతి పెద్ద మార్కెట్‌‌‌‌ను ప్రమాదంలో పడేసిందని డెలావేర్ కోర్టుకు అందించిన కౌంటర్​లో పేర్కొన్నారు. ట్విట్టర్​ను కొనుగోలు చేసేలా ఒప్పందంపై సంతకం చేయడా నికి మోసపూరితంగా తనను ఒప్పించే ప్రయత్నాలు జరిగాయని ఆరోపించా రు.

అనుచిత సోషల్ మీడియా పోస్ట్‌‌‌‌ల పై విచారణ జరపడానికి, సంబంధిత సమాచారాన్ని ఇవ్వడానికి నిరాకరించి న కంపెనీలను ప్రాసిక్యూట్ చేయడానికి భారతదేశ సమాచార, సాంకేతిక శాఖ పోయిన ఏడు ఆదేశాలు జారీ చేసింది. వీటిని ట్విట్టర్​ వ్యతిరేకించింది. దీనిపై ట్విట్టర్​ కర్నాటక హైకోర్టును ఆశ్రయించింది. రాజకీయ నేతలు, సామాజిక కార్యకర్తలు, జర్నలిస్టుల పోస్టులు తొల గించాలని ప్రభుత్వం తమపై ఒత్తిడి తెస్తోందని విమర్శించింది. స్పామ్​ ఖాతాల గురించి పూర్తివివరాలు ఇవ్వలే దంటూ మస్క్​ ట్విట్టర్​ డీల్​ నుంచి తప్పుకున్నారు. దీనిని సవాల్​ చేస్తూ ట్విట్టర్ ​మస్క్​పై కేసువేసింది.