
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని శంషాబాద్ డీసీపీ కార్యాలయం ముందు NSUI తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బల్మూరి వెంకట్ ఆందోళన చేపట్టారు. శుక్రవారం (23వ తేదీన) శంషాబాద్ ఎయిర్ పోర్టు ఆవరణలో నిర్వహించే సన్ బర్న్ కార్యక్రమానికి అనుమతి ఇవ్వడాన్ని నిరసిస్తూ ధర్నా చేపట్టారు. సన్ బర్న్ లాంటి కార్యక్రమాలకు అనుమతి ఇవ్వడం వల్ల యువత పెడదోవ పట్టే అవకాశం ఉందని, వెంటనే అనుమతి ఉపసంహరించాలంటూ డీసీపీ జగదీశ్వర్ రెడ్డికి వినతిపత్రం అందించారు. మహారాష్ట్ర, గోవా లాంటి రాష్ట్రాల్లో ఇలాంటి కార్యాక్రమాలకు అనుమతి నిరాకరిస్తుంటే.. రాష్ట్రంలో మాత్రం అనుమతి ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. సన్ బర్న్ కార్యక్రమానికి అనుమతి నిరాకరించకుంటే అడ్డుకుంటామని బల్మూరి వెంకట్ హెచ్చరించారు.
అంతకుముందు..
శంషాబాద్ ఎయిర్ పోర్టు నోవాటెల్ ప్రాంగణంలో సన్ బర్న్ ఈవెంట్ కు అనుమతి నిరాకరించాలంటూ శంషాబాద్ డీసీపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు NSUI రాష్ట్ర అధ్యక్షులు బల్మూరి వెంకట్ ప్రయత్నించారు. బల్మూరి వెంకట్ తో పాటు NSUI నాయకులను డీసీపీ కార్యాలయం గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు.