హుజూర్​నగర్​లో సీఎం సభను అడ్డుకుంటం

హుజూర్​నగర్​లో సీఎం సభను అడ్డుకుంటం

హైదరాబాద్​, వెలుగు: ఉప ఎన్నిక ప్రచారం కోసం సీఎం కేసీఆర్ హుజూర్ నగర్​లో నిర్వహిస్తున్న సభను మాదిగలతో కలిసి అడ్డుకుంటామని టీపీసీసీ అధికార ప్రతినిధి సతీశ్​ మాదిగ బుధవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఒక్క వెలమ సామాజికవర్గమే బాగుపడిందని, మాదిగలను రాజకీయంగా అణిచేస్తోన్న కేసీఆర్ గద్దెదిగే దాకా దండోరా ఉద్యమాన్ని కొనసాగిస్తామని సతీశ్​ పేర్కొన్నారు.