
ఉల్లి గడ్డ.. ప్రభుత్వాలను కూల్చిన చరిత్ర.. ఉల్లి లేకుండా నోట్లో ముద్ద తిగదు.. ఉల్లి లేని వంటింటిని.. వంటను ఊహించటం కష్టం.. అందుకే ఉల్లి ధర పెరిగింది అంటే ప్రభుత్వాలకు గుండె దడ.. ప్రతి ఏటా ఎప్పుడో ఒకప్పుడు ఉల్లి ధరలు మండిపోవటం కామన్.. కాకపోతే కొంత మేర మాత్రమే ధరలు పెరుగుతాయి.. ఈసారి మాత్రం ఉల్లి ధర.. మండిపోతుంది.. జస్ట్.. 30 రోజులు అంటే 30 రోజుల్లోనే ట్రిబుల్ అయ్యింది. అక్టోబర్ మొదటి వారంలో కిలో 30 రూపాయలుగా ఉంటే.. నవంబర్ 2వ తేదీన రిటైల్ మార్కెట్ లో కిలో ఉల్లి అక్షరాల 100 రూపాయలకు చేరింది.. 30 రోజుల్లో ట్రిబుల్ అయిన ధరతో.. సామాన్యుడే కాదు మధ్యతరగతి జనం అమ్మో ఉల్లి అంటూ భయపడుతున్నారు.
హైదరాబాద్లో ఉల్లి ధరలు కేవలం నెల రోజుల్లోనే మూడు రెట్లు పెరగడంతో హైదరాబాద్ వాసులకు ఆందోళనలో పడ్డారు. ప్రస్తుతం నగరంలో ఉల్లి ధరలు రిటైల్ మార్కెట్‌లో కిలో రూ.80 నుంచి 90 వరకు ఉన్నాయి. కొన్ని వారాల క్రితం కిలో ధర రూ.20 నుంచి -25 ఉండేది... మరికొన్ని రోజుల్లో కిలో రూ.100 వరకు పలుకుతుందని పలువురు వ్యాపారులు అంచనా వేస్తున్నారు.
రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపడం హైదరాబాద్‌లో ఉల్లి ధరల పెరుగుదలకు ఒక కారణంగా తెలుస్తోంది. దీంతో మార్కెట్‌లో ఉల్లిపాయల సరఫరా గణనీయంగా పడిపోయింది. హైదరాబాద్‌కు మహారాష్ట్ర నుంచి వచ్చే ఉల్లిపాయల సరఫరాపై ఆధారపడి ఉండడంతో రాష్ట్రం నుంచి ఉల్లి రాక ఆలస్యం కావడంతో సరఫరా -డిమాండ్‌లో తేడాలు ఏర్పడి ఉల్లి ధరలు పెరుగుదలకు కారణం అయ్యాయి.
ఇటీవల హైదరాబాద్‌లో టమాటా ధరలు భారీగా పెరిగాయి. జూలైలో టమాటా ధరలు తెలంగాణలో భారీ వర్షాల కారణంగా కిలోకు రూ. 200 రూపాయలు పలికింది. ఆ తర్వాత రోజుల్లో టమాటా ధర భారీ స్థాయిలో పడిపోయింది.
అప్పట్లో హైదరాబాద్‌లో టమాటా కొనకుండా ఇతర కూరగాయలపై దృష్టి సారించారు. హైదరాబాద్‌లో పెరుగుతున్న ఉల్లి ధరలపై ప్రజలు ఎలా స్పందిస్తారు.. ఉల్లి ధరల నియంత్రణకు ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటాయో వేచి చూడాలి.
Also Read :- వృధాగా పోతున్న తాగునీరు.. పట్టించుకోని అధికారులు