దేశంలో సంభవించిన విపత్తలు

దేశంలో సంభవించిన విపత్తలు
 • 2005కు పూర్వం ఒక సమగ్ర విపత్తు నిర్వహణ వ్యవస్థ ఏదీ భారత్​ అభివృద్ధి చేయలేదు. 
 • 1994లో జపాన్​లోని యొకొహోమా నగరంలో ఐక్యరాజ్యసమితి నిర్వహించిన సదస్సులో తొలిసారిగా విపత్తు సంసిద్ధతపై చర్చించారు. 
 • అభివృద్ధి చెందుతున్న, పేద దేశాల్లో విపత్తు నిర్వహణ చాలా పేలవంగా ఉందని గుర్తించారు. కాబట్టి ప్రతి సభ్య దేశం తమ పౌరుల రక్షణ, విపత్తు నిర్వహణ, నిర్మూలన సంసిద్ధత చర్యలను నిర్వహించి, విపత్తు ద్వారా సంభవించే నష్టాన్ని తగ్గించాలని ఈ సదస్సులో నిర్ణయించారు. 
 • అంతర్జాతీయ,  జాతీయ, ప్రాంతీయ స్థాయిలో సహకరించుకోవాలని సూచించారు. ఇదే సదస్సులో 1990–2000 దశకాన్ని ఇంటర్నేషనల్​ డికేడ్​ ఫర్​ నేచురల్​ డిజాస్టర్​ రిడక్షన్​గా గుర్తించారు. 
 • యొకొహోమ సదస్సు స్ఫూర్తితో భారత ప్రభుత్వం 1999లో జాతీయ విపత్తు నిర్వహణకు ఒక హై పవర్డ్​ కమిటీ ఏర్పాటు చేసింది. 
 • 2001 జనవరిలో గుజరాత్​ భూకంపం తర్వాత జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళిక ఏర్పాటుకు, నిర్మూలన చర్యలను సూచించడానికి ఒక జాతీయ కమిటీ ఏర్పాటు చేశారు. 
 • 10వ పంచవర్ష ప్రణాళికలో తొలిసారిగా విపత్తు నిర్వహణ అంశాన్ని చేర్చారు. 
 • 2005, డిసెంబర్​ 23న ప్రభుత్వం జాతీయ విపత్తు నిర్వహణ చట్టాన్ని ఆమోదించింది. 
 • ఈ చట్టంలో భాగంగా దేశంలో విపత్తు నిర్వహణకు మూడంచెల వ్యవస్థను ఏర్పాటు చేశారు. 
 • జాతీయ స్థాయిలో విపత్తు నిర్వహణకు ప్రణాళికలు, విధానాలను రూపొందించి మార్గదర్శకాలను విడుదల చేసే లక్ష్యంతో జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ నేషనల్​ డిజాస్టర్​ మేనేజ్​మెంట్​ అథారిటీ(ఎన్​డీఎంఏ) ఏర్పాటైంది. ప్రధాన మంత్రి ఆధ్వర్యంలోని ఉన్నత యంత్రాంగం ఎన్​డీఎంఏ విధులను నిర్వహిస్తుంది. 
 • రాష్ట్ర స్థాయిలో విపత్తు నిర్వహణకు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ కృషి చేస్తుంది. 
 • జిల్లా స్థాయి విపత్తు నిర్వహణకు జిల్లా కలెక్టర్​ ఆధ్వర్యంలోని డీడీఎంఏ ప్రణాళికలు అమలు చేస్తుంది.
 • విపత్తు నిర్వహణపై పూర్తిస్థాయిలో పరిశోధనలు నిర్వహించడంతోపాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సలహాలు, సూచనలు అందించడానికి నేషనల్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ డిజాస్టర్​ మేనేజ్​మెంట్​ న్యూఢిల్లీలో ఏర్పాటైంది.
 • యొకొహోమ సదస్సు అనంతరం 1995లో నేషనల్​ సెంటర్​ ఫర్​ డిజాస్టర్​ మేనేజ్​మెంట్​ను ఏర్పాటు చేశారు. 2003 అక్టోబర్​ 16న దీనిని ఎన్​ఐడీఎంగా అభివృద్ధి చేశారు. 
 • విపత్తు సంభవించిన సమయంలో తక్షణ సహాయ కార్యక్రమాలను అందించి ప్రమాదంలో చిక్కుకున్న వారిని వేగవంతంగా రక్షించే ఉద్దేశంతో జాతీయ విపత్తులో భాగంగా 2006లో ఎన్​డీఆర్​ఎఫ్​ ఏర్పాటైంది. 2006లో ఎనిమిది బెటాలియన్లతో ఇది ఏర్పాటైంది. ఇందులో బీఎస్​ఎఫ్​, సీఆర్​పీఎఫ్​, సీఐఎస్​ఎఫ్​, ఐటీబీపీకి చెందిన రెండు బెటాలియన్లు ఉన్నాయి. 
 • ప్రస్తుతం 15 ఎన్​డీఆర్​ఎఫ్​ బెటాలియన్లు ఉన్నాయి. పై నాలుగు ప్యారా మిలిటరీ దళాలకు అదనంగా సశస్త్ర సీమబల్​ అండ్​ అసోం రైఫిల్స్​కు చెందిన బెటాలియన్లు అందుబాటులో ఉన్నాయి. 
 • ఒక్కో బెటాలియన్​లో 1149 మంది సిబ్బంది ఉంటారు. 
 • ఎన్​డీఆర్​ఎఫ్​లో స్త్రీలను చేర్చుకునే లక్ష్యంతో 100 మంది స్త్రీ దళాన్ని ప్రభుత్వం సిద్ధం చేసింది. 
 • వీరు ఇప్పటికే ఉత్తర్​ప్రదేశ్​లో కీలక బాధ్యతలను నిర్వర్తించారు. 
 • 2013 ఉత్తరాఖండ్​ వరదలు, 2015 నేపాల్​ భూకంపం, 2022 అసోం వరదల్లో ఎన్​డీఆర్​ఎఫ్​ కీలక బాధ్యతలు నిర్వర్తించింది.