బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఫ్లెక్సీ వార్ 

బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ఫ్లెక్సీ వార్ 

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఫ్లెక్సీ గొడవ జరిగింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా అంబేద్కర్ సెంటర్ లో కాంగ్రెస్ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుంటుండగా బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట జరిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. విషయం తెలియగానే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలను సముదాయించారు.