వింతవ్యాధితో వెయ్యికి పైగా నాటుకోళ్లు మృతి

వింతవ్యాధితో వెయ్యికి పైగా నాటుకోళ్లు మృతి

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాబ్ పేటలో నాటుకోళ్లు చనిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. రాత్రి నుంచి ఫాంలోని వందలాది కోళ్లు చనిపోతున్నాయి. రాత్రి నుంచి ఇప్పటి వరకు వెయ్యికిపైగా కోళ్లు చనిపోయాయని చెబుతున్నారు ఫామ్ నిర్వాహకులు. చనిపోయిన కోళ్లను గొయ్యితీసి పూడ్చిపెట్టారు. ఓ వైపు బర్డ్ ఫ్లూ భయం కొనసాగుతుండగా…వరుసగా కోళ్లు చనిపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే కోళ్ల మృతిపై పశువైద్యాధికారులకు సమాచారం అందించారు రైతులు. వాటిని పరీక్షించిన తర్వాత కోళ్ల మృతికి కారణాలు తెలిసే అవకాశం ఉంది. వికారాబాద్ జిల్లాలోనూ వందల సంఖ్యలో కోళ్లు, కాకులు, కుక్క‌లు మృత్యువాత పడ్డాయి. దీంతో స్థానికులు భయాందోళనలకు గురౌతున్నారు.

see more news

ట్రెండింగ్.. రైతులకు మద్దతుగా పోర్న్‌స్టార్..

ఎంపీలకు వార్నింగ్ ఇచ్చిన వెంకయ్య నాయుడు