పాక్ తో చర్చలు జరిపేది లేదు

పాక్ తో చర్చలు జరిపేది లేదు

జమ్ము కశ్మీర్ లో ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. కశ్మీర్ పర్యటనలో ఉన్న ఆయన బారాముల్లాలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. ‘‘మమ్మల్ని పాకిస్తాన్ తో మాట్లాడమన్నారు...కానీ మేం కశ్మీర్ ప్రజలతో మాత్రమే మాట్లాడతామని చెప్పాం’’ అని పేర్కొన్నారు. ఓటర్ల జాబితా పూర్తయ్యాక జమ్ము కశ్మీర్ లో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహిస్తామన్నారు.  70ఏండ్ల పాటు పరిపాలించిన ముఫ్తీ, అబ్దుల్లా కుటుంబాలు పేదలకు లక్ష ఇళ్ళను కూడా నిర్మించలేకపోయాయని విమర్శించారు. మోడీ హయాంలో గత 8 ఏళ్లలో లక్ష ఇళ్ళను అందించినట్టు చెప్పారు. గత మూడేళ్లలో అన్ని గ్రామాలకు విద్యుత్ కనెక్షన్ ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. జమ్మూకశ్మీర్ ను అత్యంత శాంతియుత ప్రాంతంగా తీర్చిదిద్దాలని అనుకుంటున్నామని చెప్పారు. 

In Kashmir, Amit Shah Rules Out Talks With Pak, Says Elections Soon

1990 నుంచి జమ్మూకశ్మీర్ లో 42,000 మంది ప్రాణాలను బలిగొన్న ఉగ్రవాదం..ఎప్పుడైనా ఎవరికైనా ప్రయోజనం చేకూర్చిందా అని ప్రశ్నించారు.ముఫ్తీలు, అబ్దుల్లా కుమారులు,కాంగ్రెస్ పార్టీలు ఇక్కడి ప్రజల సంక్షేమం కోసం ఏమీ చేయలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. పహరీ కమ్యూనిటీకి త్వరలో విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. ఆర్టికల్ 370 వల్లనే ఇంతకుముందు రిజర్వేషన్లు సాధ్యం కాలేదన్నారు. ఓటర్ల జాబితా రూపొందించే పని పూర్తయిన వెంటనే పాదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తామన్నారు.