రష్యా పడవను స్వాధీనం చేసుకున్న బ్రిటన్

రష్యా పడవను స్వాధీనం చేసుకున్న బ్రిటన్
  • ప్రైవేటు వ్యాపారవేత్త పడవ విలువ 49.6 మిలియన్ డాలర్లు

రష్యా పై ప్రపంచ దేశాలు విధించిన ఆంక్షల ఎఫెక్ట్ కనిపిస్తోంది. ఇవాళ లండన్ లో నిలిపి ఉంచిన రష్యా వ్యాపారవేత్త పడవ స్వాధీనం చేసుకుంది బ్రిటన్. ఉక్రెయిన్ పై యుద్ధం ప్రారంభించిన వెంటనే రష్యా తీరుపై అసంతృప్తి వ్యక్తం చేయడంతోపాటు తీవ్ర హెచ్చరికలు జారీ చేసి ఆపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. రష్యాతో అన్ని రకాలుగా తెగతెంపులు చేసుకున్నట్లు ప్రకటించింది. రష్యాకు వ్యతిరేకంగా ప్రపంచ దేశాలతో కలసి ఐక్యరాజ్య సమితిలో తీర్మానానికి మద్దతు పలికింది. ఆంక్షలంటే ఎలా ఉంటాయో తెలిసొచ్చేలా చేస్తామని హెచ్చరించిన బ్రిటన్ ఉక్రెయిన్ - రష్యా దేశాల మధ్య టర్కీ రాజధాని ఇఫ్తాంబుల్ లో జరిగిన చర్చలు కొలిక్కి రావడానికి కొంతసేపు ముందు రష్యా పడవను స్వాధీనం చేసుకుంది. రష్యా పై ప్రకటించిన ఆంక్షలను ఆచరణలో చూపేలా తొలిసారిగా రష్యా వ్యాపారవేత్తకు చెందిన విలాసవంతమైన ప్రైవేటు పడవను స్వాధీనం చేసుకున్నట్లు బ్రిటన్ ప్రకటించింది. స్వాధీనం చేసుకున్న ప్రైవేటు పడవ విలువ 49.6 మిలియన్ డాలర్ల విలువ చేస్తుంది. 

 

ఇవి కూడా చదవండి

ఉక్రెయిన్ - రష్యా మధ్య ఫలించిన చర్చలు.. వెనక్కి తగ్గిన రష్యా

నిర్మల్ జిల్లాలో పత్తి ధర ఆల్ టైం రికార్డ్

ఎంట్రన్స్ టెస్టుల తేదీలను ప్రకటించిన ఉన్నత విద్యా మండలి

తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన ఏపీ సీఎం జగన్