బీహార్లో తెలంగాణ మోడల్.. మహిళలు, యువతే లక్ష్యంగా మహాగట్ బంధన్ మేనిఫెస్టో..

బీహార్లో తెలంగాణ మోడల్.. మహిళలు, యువతే లక్ష్యంగా మహాగట్ బంధన్ మేనిఫెస్టో..

బీహార్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్-ఆర్జేడీ కూటమి మహాగట్  బంధన్ దూసుకుపోతోంది. అందులో భాగంగా మంగళవారం (అక్టోబర్ 28) మేనిఫెస్టో విడుదల చేశారు కూటమి సీఎం అభ్యర్థి, ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్. మహిళలు, యువత లక్ష్యంగా మేనిఫెస్టో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎన్డీఏపై తీవ్ర విమర్శలకు దిగారు. నితీశ్ కుమార్ ఎన్డీఏకు పప్పెట్ గా వ్యవహరిస్తున్నారని.. నితీశ్ సీఎం అభ్యర్థి కాదని హోం మంత్రి అమిత్ షా చెప్పకనే చెప్పారని అన్నారు. 

యువత, మహిళలే లక్ష్యంగా ఓటర్లను ఆకర్శించేలా మేనిఫెస్టో విడుదల చేశారు. రిజర్వేషన్లను 60 శాతానికి పెంచనున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా ప్రచారంలో ప్రకటించినట్లుగా.. ప్రతి ఇంటికీ ఒక ఉద్యోగం ఇస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. 

ఉచిత విద్యుత్, పాత పెన్షన్ ను పురుద్ధరిచడం, మెడికల్ కాలేజీల నిర్మాణం, వృద్ధాప్య పెన్షన్లను పెంచడం మొదలైన కీలకమైన హామీలను మేనిఫెస్టోలో పొందుపరిచారు. మై బహిన్ మన్ యోజన కింద  మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. 

మేనిఫెస్టో హైలైట్స్:

  • అధికారంలోకి వచ్చిన వెంటనే 20 రోజుల్లో కుటుంబంలో ఒకరికి ఉద్యోగం
  • గ్రామీణాభివృద్ధికి తోడ్పడుతున్న జీవికా దీదీలకు (మహిళా సంఘాలకు) పర్మనెంట్ ఉద్యోగాలు
  • రాష్ట్రంలోని కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం
  • పాత పెన్షన్ స్కీమ్ (OPS) పునరుద్ధరణ
  • ప్రతి కుటుంబానికి 200 ఉచిత విద్యుత్
  •  మై బహిన్ మన్ యోజన కింద కుటుంబంలో ఒక మహిళకు రూ.2500, సంవత్సరానికి 30 వేల రూపాయలు
  • మహిళల భద్రతకు ప్రాధాన్యం.. అందుకోసం ప్రతేక వింగ్ ఏర్పాటు
  • ప్రతి జిల్లాలకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మెడికల్ కాలేజీ
  • రైతులకు మినిమమ్ సప్పోర్ట్ ప్రైస్,