మహారాష్ట్రలో ఒక్కరోజే ఏడుగురికి సోకిన ఒమిక్రాన్

మహారాష్ట్రలో ఒక్కరోజే ఏడుగురికి సోకిన ఒమిక్రాన్
  • ఒమిక్రాన్​ కేసులు @ 32
  • మహారాష్ట్రలో ఒక్కరోజే ఏడుగురికి
  • అందరికీ మైల్డ్ సింప్టమ్సే: కేంద్రం 
  • ఆంక్షల అమల్లో నిర్లక్ష్యంపై ఆందోళన 
  • కేసులు పెరుగుత యని రాష్ట్రాలకు వార్నింగ్ 

దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. శుక్రవారం నాటికి మహారాష్ట్రలో 17, రాజస్థాన్​లో 9, గుజరాత్​లో 3, కర్నాటకలో 2, ఢిల్లీలో ఒక్కటి చొప్పున మొత్తం 32 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ వేరియంట్ సోకినోళ్లందరికీ మైల్డ్ సింప్టమ్సే ఉన్నాయని చెప్పింది. 

న్యూఢిల్లీ/ ముంబై: దేశంలో ఒమిక్రాన్ కేసులు 32కు చేరాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీటిలో మహారాష్ట్రలో 17, రాజస్థాన్​లో 9, గుజరాత్ లో 3, కర్నాటకలో 2, ఢిల్లీలో ఒక్కటి చొప్పున నమోదయ్యాయని తెలిపింది. ఈ వేరియంట్ సోకినోళ్లందరికీ మైల్డ్ సింప్టమ్స్​లే ఉన్నాయని, పెద్దగా లక్షణాలేంలేవని చెప్పింది. అయితే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందంది. కొన్ని రాష్ట్రాలు కరోనా ఆంక్షల అమలు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని మండిపడింది. వైరస్ కట్టడికి ఆంక్షలను మరింత కఠినతరం చేయాలని, లేకపోతే కేసులు పెరుగుతాయని హెచ్చరించింది. ‘‘రిస్క్ దేశాల నుంచి వచ్చినోళ్లలో ఇప్పటి వరకు 83 మందికి కరోనా సోకింది. వీరిలో 13 మందికి ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్లు తేలింది” అని హెల్త్ మినిస్ట్రీ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ చెప్పారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. రిస్క్ దేశాల నుంచి వచ్చే ప్యాసింజర్లపై నిఘా పెంచాలని, అందరికీ టెస్టులు చేయాలని రాష్ట్రాలకు సూచించారు. సరైన చర్యలు తీస్కోపోవడంతోనే యూరప్ లో కేసులు పెరిగాయని పేర్కొన్నారు. 

మాస్కులు పెట్టుకుంటలేరు... 
జనం మాస్కులు పెట్టుకుంటలేరని నీతి ఆయోగ్ మెంబర్ డాక్టర్ వీకే పాల్ ఆందోళన వ్యక్తంచేశారు. ‘‘దేశంలో మాస్కుల వాడకం తగ్గింది. కరోనా కట్టడిలో మాస్కులు, వ్యాక్సిన్ ముఖ్యమైనవని గుర్తుంచుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల నుంచి మనం పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది” అని ఆయన అన్నారు. ‘‘ఒమిక్రాన్ తో ఇప్పటికైతే పెద్దగా ముప్పేమీ లేదు. కానీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది” అని ఐసీఎంఆర్ చీఫ్​ బలరాం భార్గవ తెలిపారు.

మహారాష్ట్ర్ట్రలో మూడేండ్ల పాపకూ పాజిటివ్
మహారాష్ట్రలో ఒక్కరోజే ఏడు ఒమిక్రాన్​ కేసులు నమోదయ్యాయి. ఒక్క ముంబైలోనే ముగ్గురికి పాజిటివ్​ వచ్చింది. ఈ ముగ్గురూ ఇటీవల విదేశాలకు వెళ్లొచ్చిన వాళ్లేనని అధికారులు చెప్పారు. మిగతా నలుగురికి ఎలాంటి ట్రావెల్​ హిస్టరీ లేకపోయినా.. సౌత్​ ఆఫ్రికా నుంచి వచ్చిన ఓ మహిళతో కాంటాక్ట్ అయ్యారని వివరించారు. ఆ మహిళకు అప్పటికే ఒమిక్రాన్​ వేరియంట్​ అటాక్​ కావడంతో.. ఆమె నుంచి వీళ్లకు సోకిందని చెప్పారు. పింప్రి చించల్వాడ్​కు చెందిన మూడున్నరేండ్ల పాపతో సహా నలుగురికి సౌత్​ ఆఫ్రికా మహిళ వల్ల పాజిటివ్​ వచ్చిందని అధికారులు పేర్కొన్నారు. శుక్రవారం ఒక్కరోజే పాజిటివ్​ వచ్చిన ఏడుగురిలో నలుగురు రెండు డోసుల వ్యాక్సిన్​ వేసుకున్నారని, మరొకరు ఒక్క డోసు వేసుకున్నారని తెలిపారు.

ఒమిక్రాన్ పేషెంట్ల డిశ్చార్జిపై కర్నాటక గైడ్ లైన్స్... 
ఒమిక్రాన్ పేషెంట్ల డిశ్చార్జికి కర్నాటక సర్కార్ గైడ్ లైన్స్ ఇచ్చింది. వ్యాధి తీవ్రత ఎక్కువలేని పేషెంట్లను 10 రోజుల తర్వాత డిశ్చార్జి చేయొచ్చని పేర్కొంది. అయితే, చివరి మూడ్రోజులు ఎలాంటి సింప్టమ్స్ ఉండొద్దు. చివరి నాలుగు రోజులు ఆక్సిజన్ లెవల్స్ 95 శాతానికి పైగా ఉండాలి. 24 గంటల తేడాతో రెండు ఆర్టీపీసీఆర్ రిపోర్టులు నెగెటివ్ రావాలి. డిశ్చార్జి అయినంక ఏడు రోజులు హోమ్ క్వారంటైన్ లో ఉండాలి. ఆరో రోజు ఆర్టీపీసీఆర్ టెస్టు చేస్తే నెగెటివ్ వస్తే బయటకు రావొచ్చు.