కాల్ సెంటర్ల ఫ్రాడ్  : 105 చోట్ల సీబీఐ రైడ్స్

కాల్ సెంటర్ల ఫ్రాడ్  : 105 చోట్ల సీబీఐ రైడ్స్

దేశంలోని 87 ప్రాంతాల్లో ఉన్న కాల్ సెంటర్లపై సీబీఐ ఆకస్మిక దాడులు చేసింది. మరో 18 ప్రాంతాల్లోని కాల్ సెంటర్లలో ఆయా రాష్ట్రాల పోలీసులు సోదాలు చేశారు. మొత్తంగా దేశంలోని 105 చోట్ల  కాల్ సెంటర్లు లక్ష్యంగా ఏకకాలంలో రైడ్స్ జరగడం కలకలం రేపింది. ఎందుకీ దాడులు జరుగుతున్నాయి ? అనే దానిపై సర్వత్రా చర్చ మొదలైంది. ఇటీవల అమెరికాకు చెందిన దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్బీఐ) , ఇంటర్ పోల్ ల నుంచి సీబీఐకి ఒక సమాచారం అందింది. ‘‘భారత్ లోని కొన్ని కాల్ సెంటర్లు సైబర్ నేరాలుగా అడ్డాలుగా మారాయి. వాటి నుంచి అమెరికా పౌరులను మోసగించే కాల్స్ వస్తున్నాయి. ప్రధానంగా ఆర్థికంగా చీటింగ్ చేసేలా ఆ కాల్స్ ఉంటున్నాయి’’   అని సీబీఐకి ఆ సంస్థలు తెలిపాయి.

ఇంటర్ పోల్, ఎఫ్బీఐ ఇచ్చిన సమాచారం ఆధారంగా పలు కాల్ సెంటర్లపై సీబీఐ రైడ్స్ చేసింది. ఢిల్లీ, అండమాన్ నికోబార్, పంజాబ్, చండీగఢ్, రాజస్థాన్, అస్సాం, కర్ణాటక రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల్లో రైడ్స్ జరిగినట్లు తెలుస్తోంది. ఇటీవల రాజస్థాన్ లోని రాజ్ సమంద్ ప్రాంతంలోని ఒక కాల్ సెంటర్ పై పోలీసులు దాడి చేయగా.. 1 కేజీ బంగారం, 50 మిలియన్ డాలర్ల నగదు లభించింది. ఫోన్ కాల్స్ తో ప్రజలను మోసగిస్తున్న మరో రెండు కాల్ సెంటర్లను పుణె, అహ్మదాబాద్ నగరాల్లో గుర్తించారు.