నారాయణగూడలో రూ. 8 కోట్లు స్వాధీనం

నారాయణగూడలో రూ. 8 కోట్లు స్వాధీనం

హైదరాబాద్ నారాయణగూడ లో భారీగా నగదును పట్టుకున్నారు నార్త్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు. త్వరలో రాష్ట్రంలో ఎన్నికలు జరగనుండటంతో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అక్రమంగా తరలిస్తున్న డబ్బు, లిక్కర్ ను స్వాధీనం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా నారాయణ గూడలో ఓ జాతీయ పార్టీ కార్యాలయ నిర్వాహకుని నుంచి 8 కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. అతన్ని అదుపులోకి తీసుకున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. పార్టీ అధ్యక్షుడి ఆదేశాలతోనే బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేసినట్లు తెలిపాడు ఆ నిర్వాహకుడు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.