
న్యూఢిల్లీ: యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ (యూఎన్ఎస్‌సీ) కు ఎనిమిదో సారి ఎంపిక చేస్తారని ఊహిస్తున్న ఇండియా ఆ విషయంపై శుక్రవారం స్పందించింది. ఇంటర్నేషనల్ డెర్రరిజం, రీఫార్మింగ్ మల్టీలేటరల్ సిస్టమ్ లాంటి ఇష్యూస్‌పై వరల్డ్ బాడీతో కలసి ప్రభావవంతంగా పనిని కొనసాగించడడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ఈ నెల 17న నిర్వహించనున్న యూఎన్ఎస్‌సీ ఎలక్షన్స్‌కు సంబంధించి ఇండియా ప్రాధామ్యాల బ్రోచర్‌ను విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ లాంచ్ చేశారు. దీని ప్రకారం ప్రధాని నరేంద్ర మోడీ రూపొందించిన ‘ఫైవ్ ఎస్’ అనే విధానంతో ఇండియా ముందుకెళ్లనుంది.
యూఎన్ఎస్‌సీ విషయంలో సమ్మాన్ (రెస్పెక్ట్), సంవాద్ (డైలాగ్), సహ్‌యోగ్ (కాపరేషన్), శాంతి (పీస్)ని విశ్వవ్యాప్తంగా స్థాపించడం కోసం సమృద్ధి (ప్రాస్పర్టీ) అనే అంశాలతో 5 ఎస్ విధానంతో ఇండియా ముందుకెళ్లనుంది. ఈ సందర్భంగా మాట్లాడిన మినిస్టర్ జైశంకర్.. ఇంటర్నేషనల్ పీస్, సెక్యూరిటీ కోసం ఇప్పటికే ఉన్న సమస్యలతోపాటు కొత్త ఛాలెంజ్‌లను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. యూఎన్ సెక్రటరీ కౌన్సిల్‌కు ఇండియా అభ్యర్థిత్వం సక్సెస్ అవుతుందని, ఆసియా–పసిఫిక్ గ్రూప్‌లో సింగిల్ ఇండోర్స్‌డ్‌గా మన దేశం ఒక్కటే ఉందని విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి (వెస్ట్) వికాస్ స్వరూప్ పేర్కొన్నారు. రెండేళ్ల పాటు సాగనున్న యూఎన్ఎస్‌సీ పదవీకాలం 2021వ సంవత్సరం జనవరితో ముగుస్తుంది. యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ పదవిలో కొనసాగడం ఇండియా లక్ష్యంగా కనిపిస్తోంది.