
న్యూఢిల్లీ: ఇన్ఫోసిస్ సుధామూర్తిపై ప్రధాని మోదీ ప్రశంసలు కురించారు. సమాజ సేవకురాలిగా మహిళల ఆరోగ్యం పట్ల ఆమెకున్న అంకిత భావాన్ని అభినందించారు.రాజ్యసభలో మహిళల ఆరో గ్యంపై సుధామూర్తి చేసిన సవివరణపై కృతజ్ణతలు చెప్పారు మోదీ. కొత్త రాజ్యసభకు ఎన్నికైన ఇన్ఫోసిస్ సుధామూర్తి.. మంగళవారం (జూన్ 2) రాజ్యసభలో మహిళల ఆరోగ్యం..కోవిడ్ సమయంలో ప్రభుత్వం నిర్ణయాలపై మాట్లాడారు.
సుధామూర్తి ప్రారంభ ప్రసంగంలోనే బాధ్యతగల సభ్యురాలిగా 13 నిమిషాలపాటు మహిళల ఆరోగ్యంపై మాట్లాడారు. మహిళలపై సుధామూర్తి ఎమోషనల్ స్పీచ్ ను ప్రధాని మోదీ అంగీకరిస్తూనే.. పదేళ్లలో మహిళల ఆరోగ్యం, పారిశుధ్యానికి ప్రాధాన్యత ఇచ్చిందని ఎన్డీయే ప్రభుత్వం అంకిత భావాన్ని హైలైట్ చేశారు. టాయిలెట్లు, శానిటరీ ప్యాడ్ ల ఏర్పాట్లు, గర్భిణీలకు వ్యాక్సినేషన్ కార్య క్రమం అమలు వంటి ప్రభుత్వ ప్రోగ్రామ్ లను వివరించారు. ఆమెకు లేచి నిలబడి కృతజ్ణతలు తెలిపారు.
రాజ్యసభలో సుధామూర్తి తన తొలి ప్రసంగంలో..9 నుంచి 14 ఏళ్ళ వయసున్న బాలికల గర్భాశయ క్యాన్సర్లను నిరోధించేందుకు ప్రభుత్వం..టీకా కార్యక్రమం ఏర్పాటు చేయాలని కోరారు. తొమ్మిది నుండి 14 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న బాలికలకు ఇవ్వబడే ఒక టీకా ఉంది, దీనిని గర్భాశయ టీకా అంటారు. ఇది మార్కెట్ లో రూ. 1400 ల కు దొరుకుతుంది. ప్రభుత్వం జోక్యం చేసుకుంటే.. ఇది రూ. 800లకు లభించొచ్చు..క్యాన్సర్ ట్రీట్ మెంట్ కంటే నివారణ ముఖ్యం.. అందేకే దీనిని మేం ప్రమోట్ చేస్తున్నాం అని సుధామూర్తి తన 13 నిమిషాల ప్రసంగం మొత్తం మహిళల ఆరోగ్యంపై ప్రస్తావించారు.
కోవిడ్ సమయంలో ప్రభుత్వం చేపట్టిన వ్యాక్సినేషన్ డ్రైవ్ ను సక్సెస్ ఫుల్ గా కేంద్ర ప్రభుత్వం నిర్వహించింది. ఇటువంటి కార్యక్రమాన్ని అమలు చేయగల ప్రభుత్వం సామర్థ్యంపై ఎంపీ సుధా మూర్తి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
? Sudha Murty's First Speech in Rajya Sabha
— Ravisutanjani (@Ravisutanjani) July 2, 2024
Excellent and Very Beautiful, Must Watch ? pic.twitter.com/Ji5WJkEf8c