యూపీలో ఇద్దరు సాదువుల హత్య.. యోగీకి ఉద్ధవ్ ఠాక్రే ఫోన్

యూపీలో ఇద్దరు సాదువుల హత్య.. యోగీకి ఉద్ధవ్ ఠాక్రే ఫోన్

ఉత్తర ప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్య నాథ్ కు ఫోన్ చేసి మాట్లాడారు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే. సోమవారం రాత్రి యూపీలో ఇద్దరు సాదువులను హత్య చేసిన ఘటనపై ఆరా తీశారు. నింధితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని కోరారు.  అయితే ఈ ఘటన మత పరంగా సున్నితమైనదని తెలిపారు. తమ సపోర్ట్ యోగీ ఆధిత్య నాధ్ కు ఎప్పుడూ ఉంటుందని తెలిపినట్లు మీడియాకు చెప్పారు ఠాక్రే. తాము సాధువుల హత్యలను ఎలా హ్యాండిల్ చేశామో యోగి ఆదిత్యనాథ్ ను కూడా అలాగే సున్నితంగా హ్యండిల్ చేయాలని కోరామని అన్నారు. మహారాష్ట్రలో ఇద్దరు సాదువులను హత్య చేసిన ఘటనలో ఆ రాష్ట్ర ప్రభుత్వం 100మందిపై కేసును నమోదు చేసింది.

ఉత్తర ప్రదేశ్ లోని బులంద్ షార్ గ్రామంలో సోమవారం రాత్రి ఇద్దరు సాదువుల మృతదేహాలు లభ్యమయ్యాయి. వారు జగదీష్ అలియాస్ రంగీ దాస్ (55), అతని శిష్యుడు షేర్ సింగ్ ను హత్య చేశారు. దీంతో మురారి అలియాస్ రాజును   పోలీసులు అరెస్ట్ చేశారు.