థాయిలాండ్ మార్కెట్ లో రెడీ టు డ్రింక్ కొబ్బరి బోండాలు

థాయిలాండ్ మార్కెట్ లో రెడీ టు డ్రింక్ కొబ్బరి బోండాలు

ఐడియా ఉండాలేగానీ... పది రూపాయల వస్తువుతో బిజినెస్ చేసి వందలు సంపాదించొచ్చు. అదే స్ట్రాటజీని థాయిలాండ్ వ్యాపారులు ఫాలో అవుతున్నారు. మన దగ్గర రోడ్డు పక్కన అమ్మే ఒక కొబ్బరిబోండా రూ. 40 నుంచి 50 వరకు ఉంటుంది. అదే ఆన్ లైన్ లో ఆర్డర్ పెడితే ఓ ఐదో పదో తేడా ఉంటుంది. కానీ, థాయిలాండ్ లో మాత్రం ఆన్ లైన్ ఒక కొబ్బరిబోండా దాదాపు రూ. 600 పలుకుతోంది. కొబ్బరిబోండాకు ఎందుకంత రేటు? దాంట్లో స్పెషల్ ఏముంది? అంటారా..

వాళ్లు అమ్మేది మామూలు కొబ్బరి బోండానే. కానీ, దాన్ని నీటుగా ప్యాక్ చేసి డెలివరీ చేస్తారు అందుకే అంత రేటు అంటున్నారు. ఆర్గారిక్ బోండా, రెడీ టు డ్రింక్ పేరుతో తీసుకొస్తున్న ఈ కొబ్బరిబోండాకు చుట్టూ ఉన్న తొక్కతీస్తారు. పై భాగాన్ని కత్తిరించి ట్యాప్ లాంటిది అమర్చుతారు. స్ట్రా సాయం లేకుండా మూత తీసి కొబ్బరిబోండా తాగేయొచ్చు. ఆ ట్యాప్ ని పీకేసి మధ్యలో ఉన్న లేత కొబ్బరి తినొచ్చు. అందుకు ఒక స్పూన్ కూడా ఇస్తున్నారు. నాలుగు కొబ్బరిబోండాల ధర 28.99 డాలర్లు (2,369 రూపాయలు) ఉంది. అంటే ఒక్క కొబ్బరిబోండా రేటు దాదాపు రూ.600 అన్నమాట. దీనికి సంబంధించిన ఫొటోలు రెడ్డిట్ లో వైరల్ అవుతున్నాయి.  ooxooshaweideifegiec యూజర్ నేమ్ తో ఉన్న అకౌంట్ నుంచి కొబ్బరిబోండా ఫొటోలు అప్ లోడ్ అయ్యాయి.