83 కోట్ల లక్ష్యం : నాటినవి 38 కోట్లే

83 కోట్ల లక్ష్యం : నాటినవి 38 కోట్లే

ఐదో విడత హరిత హారంలో 83 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యం పెట్టుకున్నా .. 38 కోట్ల మొక్కలే నాటారు.

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగులక్ష్యం చేరకుండానే ఐదో విడత హరితహారం అటకెక్కింది. 83 కోట్లు మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకుని, ఇప్పటిదాకా 38.06 కోట్ల మొక్కలు మాత్రమే నాటారు. కొన్ని జిల్లాలోనైతే టార్గెట్ లో 20% కూడా చేరుకోలేకపోయారు. వరంగల్ అర్బన్ జిల్లాలో 2.86 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకుని, 37 లక్షల(13.2%) మొక్కలే నాటారు. హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎండీఏ పరిధిలో 5.8 కోట్ల మొక్కల లక్ష్యానికి గానూ 85 లక్షల(14.7%) మొక్కలు పెట్టారు. ఇలా 6 జిల్లాల్లో 30% లక్ష్యాన్ని కూడా చేరుకోలేదు. 18 జిల్లాల్లో 50% మొక్కలు కూడా నాటలేదు. భద్రాద్రి కొత్తగూడెం, మేడ్చల్ జిల్లాల్లో మాత్రమే లక్ష్యాన్ని పూర్తిచేశామని అధికారులు తెలిపారు. వానాకాలం పోయాక దాదాపు అన్ని జిల్లాల్లో మొక్కలు నాటడం ఆపేశారు. ప్రస్తుతం ఒకట్రెండు జిల్లాల్లో మాత్రం కార్యక్రమం కొనసాగుతోంది. దీంతో ఈ ఏడాది పెట్టుకున్న లక్ష్యంలో 50% కూడా చేరుకునే పరిస్థితి లేదని అధికారులే చెబుతున్నారు.

అంతంత మాత్రంగానే ఆగ్రో ఫారెస్ట్రీ

ఆదాయాన్నిచ్చే మొక్కలిస్తే.. రైతులు వాటిని జాగ్రత్తగా కాపాడుకుంటారన్న ఆలోచనతో ఈసారి గంధం, వెదురు తదితర మొక్కలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. 20.5 లక్షల గంధం, 12 కోట్ల టేకు మొక్కలు, దాదాపు 4 కోట్ల వెదురు మొక్కలు సిద్ధం చేశామని ప్రకటించారు. ఇందులో సగం కూడా పంపిణీ చేయలేదు. ఆగ్రోఫారెస్ట్రీ మొక్కల పంపిణీ, రైతుల గుర్తింపు బాధ్యతలను హార్టికల్చర్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అప్పగించారు. ఇప్పటివరకు 574 మంది రైతులకు 6 లక్షల గంధం మొక్కలు, 320 మందికి 2 లక్షల వెదురు మొక్కలు మాత్రమే పంపిణీ చేసినట్టు హార్టికల్చర్ ఆఫీసర్లు వెల్లడించారు. టేకు మొక్కల్లోనూ 60 శాతమే పంపిణీ చేసినట్టు చెబుతున్నారు. ఇక ఒక్కో జిల్లాలో రోడ్ల వెంబడి కనీసం 15 నుంచి 20 కిలోమీటర్ల మేర చింత మొక్కలు నాటాలని సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే, ఏ ఒక్క జిల్లాలోనూ సీఎం చెప్పినదాంట్లో 20% కూడా పని పూర్తిచేయలేదు. చింత మొక్కలు అందుబాటులో లేకపోవడంతో నాటలేదని అధికారులు చెప్తున్నారు.

ఐదేండ్లైనా లక్ష్యాన్ని చేరుకోలె

ఐదేండ్లలో 230 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా 2015 లో సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సీజీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో ఐదు విడతల హరితహారాలు ముగిసినా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. 2015 నుంచి ఇప్పటివరకూ 152 కోట్ల మొక్కలనే నాటగలిగారు. నిర్దేశించుకున్న లక్ష్యం మేర మొక్కలు సిద్ధం కాలేదని చెబుతూ వస్తున్నారు. 2018 జులైలో నాలుగో విడత హరితహారం ప్రారంభిస్తూ.. 2019 నుంచి ఏటా వంద కోట్ల మొక్కలు నాటనున్నట్లు సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రకటించారు. ఈ లెక్కన ఏడాది ముందుగానే లక్ష్యం నిర్దేశించుకున్నా, ఆ మేరకు ఈ ఏడాది కూడా మొక్కలను సిద్ధం చేయలేకపోయారు. ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయకపోవడం, విపరీతమైన ఎండలే దీనికి కారణమని అధికారులు చెబుతున్నారు. నాటిన మొక్కల్లో ఎన్ని బతికాయన్న దానిపై స్పష్టమైన లెక్కలు లేవు.

మరింత సమాచారం కోసం