అయోధ్య కేసులో.. తీర్పు ఏదైనా ఆమోదిస్తాం : ముస్లిం సంస్థ

అయోధ్య కేసులో.. తీర్పు ఏదైనా ఆమోదిస్తాం : ముస్లిం సంస్థ

న్యూఢిల్లీ: వివాదాస్పద రామజన్మభూమి కేసులో తీర్పు ఏదైనా తాము ఆమోదిస్తామని ముస్లిం సంస్థ జమియత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ – ఉలేమా – ఇ – హింద్‌ ప్రకటించింది. సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పును ప్రతి ఒక్కరు గౌరవించాలని విజ్ఞప్తి చేసింది. గుడిని కూలగొట్టకుండానే బాబ్రీ మసీదును నిర్మించారనే చారిత్రక వాస్తవాలు, ఆధారాలతో ముస్లింలు దావా వేశారని జమియత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మౌలానా అర్షద్‌ మదీనా చెప్పారు. అయోధ్య కేసు కేవలం భూ వివాదం కాదని, చట్టానికి టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కేస్‌ అని అభిప్రాయపడ్డారు .

“ న్యాయాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరు విశ్వాసం, నమ్మకం ఆధారంగా కాకుండా కఠినమైన వాస్తవాలు, సాక్ష్యాల ఆధారంగా తీర్పు చెప్పాలని కోరుకుంటారు . మేం మా మాట నిలబెట్టుకుంటాం . సుప్రీం కోర్టు ఏ తీర్పు ఇచ్చినా అంగీకరిస్తాం. తీర్పు ఏదైనా ముస్లింలు, మిగతావారు సుప్రీం జడ్జిమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ను ఒప్పుకోవాలి” అని చెప్పారు.