తొలి టీ20లో ఇండియా గెలుపు

తొలి టీ20లో ఇండియా గెలుపు

పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌ స్పెయిన్‌‌‌‌: వన్డే సిరీస్‌‌‌‌ గెలుపు జోష్‌‌‌‌ను టీమిండియా టీ–20 ఫార్మాట్‌‌‌‌లోనూ కొనసాగించింది. రోహిత్‌‌‌‌ శర్మ (44 బాల్స్‌‌‌‌లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 64) కెప్టెన్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌కు తోడు, దినేశ్‌‌‌‌ కార్తీక్‌‌‌‌ (19 బాల్స్‌‌‌‌లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 41 నాటౌట్‌‌‌‌) సూపర్‌‌‌‌ ఫినిషింగ్‌‌‌‌ ఇవ్వడంతో.. శుక్రవారం జరిగిన తొలి టీ20లో ఇండియా 68 రన్స్‌‌‌‌ తేడాతో వెస్టిండీస్‌‌‌‌ను ఓడించింది. ఫలితంగా ఐదు మ్యాచ్‌‌‌‌ల సిరీస్‌‌‌‌లో 1–0 లీడ్‌‌‌‌లో నిలిచింది.

టాస్‌‌‌‌ ఓడి బ్యాటింగ్‌‌‌‌కు దిగిన ఇండియా 20 ఓవర్లలో 190/6 స్కోరు చేసింది. సూర్యకుమార్‌‌‌‌ (24) ఫర్వాలేదనిపించాడు. విండీస్‌‌‌‌ బౌలర్లలో అల్జారీ జోసెఫ్‌‌‌‌ 2 వికెట్లు తీశాడు. తర్వాత ఛేజింగ్‌‌‌‌లో విండీస్‌‌‌‌ 20  ఓవర్లలో 122/8  స్కోరుకే పరిమితమైంది. బ్రూక్స్‌‌‌‌ (20) టాప్‌‌‌‌ స్కోరర్‌‌‌‌. స్టార్టింగ్‌‌‌‌ నుంచే ఇండియా పేస్‌‌‌‌–స్పిన్‌‌‌‌ కాంబినేషన్‌‌‌‌ సమర్థంగా పని చేయడంతో కరీబియన్‌‌‌‌ బ్యాటర్లు రన్స్‌‌‌‌ చేయడానికి ఇబ్బందులు పడ్డారు. దీంతో పూరన్‌‌‌‌ (18), మేయర్స్‌‌‌‌ (15), పావెల్‌‌‌‌ (14), హెట్‌‌‌‌మయర్‌‌‌‌ (14)తో సహా అందరూ విఫలమయ్యారు. ఇండియా బౌలర్లలో అర్షదీప్‌‌‌‌, అశ్విన్‌‌‌‌, రవి తలా రెండు వికెట్లు తీశారు. కార్తీక్‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది. ఈ మ్యాచ్‌‌‌‌తో  టీ20ల్లో అత్యధిక రన్స్‌‌‌‌ (3443) చేసిన ప్లేయర్‌‌‌‌గా రోహిత్‌‌‌‌ రికార్డు సృష్టించాడు. మార్టిన్‌‌‌‌ గప్టిల్‌‌‌‌ (3399), కోహ్లీ (3308) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. రెండో టీ20 సోమవారం జరుగుతుంది.