హైదరాబాద్ బీజేపీ ఆఫీసులో ‘మహిళా గోస -బీజేపీ భరోసా’ పేరుతో దీక్ష

హైదరాబాద్ బీజేపీ ఆఫీసులో ‘మహిళా గోస -బీజేపీ భరోసా’ పేరుతో దీక్ష

హైదరాబాద్ బీజేపీ ఆఫీసులో ఆ పార్టీ నాయకులు ‘మహిళా గోస -బీజేపీ భరోసా’ పేరుతో దీక్ష చేపట్టారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని మహిళా మోర్చా ఆందోళన వ్యక్తం చేస్తోంది. లిక్కర్ కట్టడి చేయాలని డిమాండ్ చేస్తూ దీక్ష ప్రారంభించింది. రాష్ట్రంలో బెల్టు షాపుల దందాపై మహిళా మోర్చా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ కార్యక్రమంలో డీకే అరుణ, విజయశాంతి, ఇతర ముఖ్యనేతలు పాల్గొననున్నారు.