సూపర్​వైజరీ కమిటీ చైర్మన్​ కక్రూపై అజర్​ ఎదురుదాడి

సూపర్​వైజరీ కమిటీ చైర్మన్​ కక్రూపై అజర్​ ఎదురుదాడి

హైదరాబాద్‌‌, వెలుగు:  హైదరాబాద్‌‌ క్రికెట్‌‌ అసోసియేషన్‌‌లో మరోసారి అలజడి మొదలైంది. హెచ్‌‌సీఏ ప్రెసిడెంట్‌‌గా అజరుద్దీన్​ పదవీకాలం ఈ సెప్టెంబర్‌‌తోనే ముగిసినందున  ఆ తర్వాత అతను తీసుకున్న ఏ నిర్ణయం కూడా చెల్లదని  హెచ్‌‌సీఏ సూపర్‌‌ వైజరీ కమిటీ చైర్మన్‌‌, రిటైర్డ్‌‌ జస్టిస్‌‌ నిస్సార్‌‌ అహ్మద్‌‌ కక్రూ చెప్పారు. దీనిపై అజరుద్దీన్‌‌... కక్రూపై ఎదురుదాడికి దిగాడు. హెచ్‌‌సీఏ ప్రెసిడెంట్‌‌గా తన టర్మ్‌‌ ముగిసిందనడానికి ఎలాంటి ఆర్డర్‌‌ రాలేదని చెప్పాడు.  సూపర్‌‌ వైజరీ కమిటీ చైర్మన్‌‌గా కక్రూ ఎంపికపైనే తనకు అభ్యంతరాలు ఉన్నాయంటూ ఆ కమిటీ మెంబర్స్‌‌కు శుక్రవారం లెటర్‌‌ రాశాడు. గతంలో హెచ్‌‌సీఏ అంబుడ్స్‌‌మన్‌‌గా కక్రూ పేరును తన ప్రత్యర్థి వర్గం ప్రతిపాదించిందన్నాడు. ఈ నేపథ్యంలో సూపర్‌‌ వైజరీ కమిటీ చైర్మన్‌‌గా కక్రూ బాధ్యతలు తీసుకోవడం విరుద్ధ ప్రయోజనాల కిందకు వస్తుందన్నాడు.  తన ప్రత్యర్థి వర్గానికి చెందిన అర్షద్‌‌ ఆయుబ్, శివలాల్‌‌ యాదవ్‌‌ తదితరుల ఎజెండా ప్రకారం కక్రూ పని చేస్తున్నారని విమర్శించాడు. అందుకే హెచ్‌‌సీఏలో తన టర్మ్‌‌ ముగిసిందని ప్రకటించి, మోసపూరిత ఓటర్ల జాబితాతో ఎన్నికలు నిర్వహించాలని చూస్తున్నాడని ఆరోపించాడు.