గత 15 ఏళ్లలో.. రియల్టీలోకి రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులు.. 57 శాతం విదేశీ ఇన్వెస్టర్ల నుంచే..

 గత 15 ఏళ్లలో.. రియల్టీలోకి రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులు.. 57 శాతం విదేశీ ఇన్వెస్టర్ల నుంచే..
  • క్రెడాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌-కొలియర్స్ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: భారత రియల్ ఎస్టేట్ రంగంలోకి గత 15 ఏళ్లలో 80 బిలియన్ డాలర్ల (రూ.7 లక్షల కోట్ల)  పెట్టుబడులు వచ్చాయి.  ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు ఈ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై సానుకూలంగా ఉన్నారు.  ఈ పెట్టుబడుల్లో  57 శాతం విదేశీ పెట్టుబడిదారుల వాటా ఉందని రియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎస్టేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆర్గనైజేషన్ క్రెడాయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కన్సల్టెన్సీ కొలియర్స్ ఇండియా కలిసి తయారు చేసిన రిపోర్ట్ పేర్కొంది.   

క్రెడాయ్ నాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  వార్షిక సమావేశంలో ఈ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను  విడుదల చేశారు. ఈ సంస్థకు దేశవ్యాప్తంగా 13 వేలకి పైగా సభ్యులు ఉన్నారు. ఈ రిపోర్ట్ ప్రకారం,  కొవిడ్ తర్వాత దేశీయ మూలధనం వాటా కూడా పెరిగింది. సంస్థాగత పెట్టుబడుల్లో ఫ్యామిలీ ఆఫీసులు, విదేశీ కార్పొరేట్ గ్రూపులు, బ్యాంకులు, పెన్షన్ ఫండ్లు, ప్రైవేట్ ఈక్విటీ, ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీలు, రీట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సావరిన్ వెల్త్ ఫండ్లు వంటివి ఉన్నాయి. భవిష్యత్తులో  మరిన్ని పెట్టుబడులు వస్తాయని అంచనా. 

ప్రస్తుతం రియల్ ఎస్టేట్ సెక్టార్ సైజ్ 650 బిలియన్ డాలర్లు ఉండగా,  ఇది  2047 నాటికి 5–10 ట్రిలియన్ డాలర్లకు  చేరే అవకాశం.  గ్రేడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏ ఆఫీస్, ఇండస్ట్రియల్ కేటగిరీ మొత్తం  200 కోట్ల  చదరపు అడుగుల్లో విస్తరించనుంది.  రెసిడెన్షియల్ సేల్స్ ఏడాదికి 10 లక్షల యూనిట్లకు  చేరుతాయి. ప్రస్తుత స్థాయి నుంచి రెట్టింపు అవుతాయి.  డేటా సెంటర్లు, సీనియర్ లివింగ్, మాల్స్, హోటల్స్ వంటి విభాగాల్లో డిమాండ్ 
పెరుగుతోంది.