
కొమురంభీం జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో కాగజ్‌నగర్ లో ప్రతిపక్ష నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారు. కాగజ్ నగర్ లోని కాంగ్రెస్, బీఎస్సీ, తెలుగుదేశం, సీపీఎం పార్టీ నేతలతో పాటు పలు కుల సంఘాల నాయకులను ముందస్తుగా అరెస్టు చేస్తున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం (జూన్ 30న) కొమురంభీం జిల్లా ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12.00 గంటలకు సిద్దిపేటలోని అగ్రికల్చర్ ఫామ్ నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి 12.55 గంటలకు కొమురంభీం జిల్లా ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్‌లోని హెలిప్యాడ్‌కు చేరుకొంటారు. 1.15 గంటలకు కొమురంభీం కుమ్రం భీం చౌరస్తాకు చేరుకొని, అక్కడ కొమురంభీం విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. 1.25 గంటలకు బీఆర్‌ఎస్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. 1.50 గంటలకు చిల్డ్రన్ పార్క్‌లో కొట్నాక్ భీంరావ్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.
2.10 గంటలకు జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. 2.30 గంటలకు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని ప్రారంభించి ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు సీఎం కేసీఆర్. అక్కడే జిల్లాలోని లబ్ధిదారులకు పోడు పట్టాలు అందజేస్తారు. అక్కడే భోజనం చేసి సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం 5.05 గంటలకు హెలికాప్టర్‌లో తిరుగు ప్రయాణమై 6.15 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకొంటారు. 6.25 గంటలకు ప్రగతి భవన్‌కు వెళ్తారు.