ఈ సెషన్‌లోనే అసెంబ్లీ ముందుకు.. కొత్త రెవెన్యూ యాక్ట్

ఈ సెషన్‌లోనే అసెంబ్లీ ముందుకు.. కొత్త రెవెన్యూ యాక్ట్

హైదరాబాద్, వెలుగు: రాబోయే అసెంబ్లీవర్షాకాల సమావేశాల్లో కొత్త రెవెన్యూ యాక్ట్ ను సభలో ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రెవెన్యూ శాఖ పనితీరుపై కొద్దికాలంగా సీఎం కేసీఆర్ అసంతృప్తిగా ఉన్నారు. రెవెన్యూ శాఖలో అవినీతి పేరుకుపోయిందని, ఆ శాఖలో అవినీతి లేకుండా చేస్తానని సీఎం ప్రకటించారు. తాజాగా కీసర ఎమ్మా ర్వో రూ.1.2 కోట్లు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. దీంతో వెంటనే కొత్త రెవెన్యూ చట్టం తీసు కు రావాలని సీఎం పట్టుదలగా ఉన్నట్టు అధికారులు అంటున్నారు. ప్రస్తుత చట్టం ప్రకారం మ్యూటేషన్ చేసే అధికారం ఎమ్మోర్వోలకు ఉంది. దానిని తొలగించేలా కొత్త చట్టం ఉంటుందని అధికార వర్గాలు చెప్తున్నారు. ఈ మేరకు చీఫ్ అడ్వయిజర్ రాజీవ్ శర్మ నేతృత్వంలో ముసాయిదా బిల్లుపై కసరత్తు పూర్తయిందని తెలిపాయి. బ్యాంక్ సేవల మాదిరిగా భూ క్రయవిక్రయాలు బ్యాంకు సేవల మాదిరిగా భూ క్రయవిక్రయాలు ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. భూ అమ్మకం, కొనుగోలు సమయాల్లో ఎలాంటి అవినీతి లేకుండా కొత్త చట్టం ఉంటుందని అధికారులు అంటున్నారు. ఎలాంటి లీగల్ ప్రాబ్లమ్స్ లేకపోతే వెంటనే మ్యూటే షన్ జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్త చట్టంలో ఎమ్మోర్వోలకు ప్రొటోకాల్ బాధ్యతలు, మరణ, జనన, కుల ధ్రువీకరణ సర్టిఫికెట్స్ తో పాటు కొన్నిసాధారణ పవర్స్ ఉండే చాన్స్ ఉందని అంటున్నాయి.

ప్రాణాలు కాపాడే మమ్మల్ని సర్కారు పట్టించుకోవట్లే