భారీ అగ్నిప్రమాదం.. ఐదుగురు సజీవదహనం

భారీ అగ్నిప్రమాదం.. ఐదుగురు సజీవదహనం

ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దేహాత్ ప్రాంతంలోని హర్మౌ బంజారాడేరా గ్రామంలో ఓ గుడిసెలో మంటలు చెలరేగడంతో ఐదుగురు సజీవదహనం అయ్యారు. వారిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. మార్చి 12వ తేదీ తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. గుడిసెలో ఆకస్మికంగా మొదలైన మంటలు.. కాసేపటికే భారీ అగ్ని ప్రమాదానికి దారి తీశాయి. దీంతో గుడిసె అంతా మంటల్లో చిక్కుకుపోయింది.

విషయం గ్రహించిన స్థానికులు మంటలను ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. అప్పటికే ఆ ఇంట్లో  నిద్రపోతున్న ఐదుగురు వ్యక్తులు మంటల్లో కాలిపోయి, మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఇక చనిపోయిన వారిలో సతీష్ కుమార్, ఆయన భార్య కాజల్, వారి ముగ్గురు పిల్లులు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు.