
ఓయూ,వెలుగు: ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన వందేళ్ల పైలాన్ ను ఎమ్మెల్సీ సురభివాణితో కలిసి వీసీ ప్రొఫెసర్ రవీందర్ బుధవారం ప్రారంభించారు. ఆర్ట్స్ కాలేజీ పక్కనే నిర్మించిన పైలాన్ ను ఆవిష్కరించటం తన జీవితంలో మరచిపోలేనని ఎమ్మెల్సీ ఆనందం వ్యక్తం చేశారు. ఓయూ 75 ఏళ్ల పైలాన్ ను తన తండ్రి అప్పటి దేశ ప్రధాని పీవీ నరసింహారావు ప్రారంభించగా.. వందేళ్ల పైలాన్ తన చేతుల మీదుగా ప్రారంభించడం అదృష్టంగా భావిస్తున్నట్లు ఆమె తెలిపారు.
ఓయూ అందించిన వందేళ్ల విద్యా, పరిశోధన, ఆవిష్కరణలు, పోరాట వారసత్వానికి చిహ్నంగా పైలాన్ నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్లక్ష్మీనారాయణ, పైలాన్రూపకర్తలు జేఎన్టీయూ ఫైన్ ఆర్ట్స్ కాలేజీకి చెందిన ఆర్కిటెక్ట్ రాజేందర్ ,శిల్పి కేఎస్ రఘు చక్రవర్తి , అధ్యాపకులు పాల్గొన్నారు.