బ్రెయిలీ లిపిలో కేసీఆర్ జీవిత చరిత్ర

బ్రెయిలీ లిపిలో కేసీఆర్ జీవిత చరిత్ర

బ్రెయిలీ లిపిలో ముద్రించిన సీఎం కేసీఆర్ జీవిత చరిత్ర పుస్తకాన్ని ప్రగతిభవన్ లో మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ డా.కె.వాసుదేవరెడ్డి ఆధ్వర్యంలో.. బ్రెయిలీ లిపిలో కేసీఆర్ జీవిత చరిత్ర పుస్తకాన్ని ముద్రించారు. కేసీఆర్ బాల్యం, విద్యాభ్యాసం, విద్యార్థి రాజకీయ జీవితం, రాజకీయంలో అనుభవించిన పదవులు, కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం, ముఖ్యమంత్రిగా ఆయన పాలన, తెలంగాణలో అమలవుతున్న పథకాలను పుస్తకంలో వివరించినట్లు వాసుదేవరెడ్డి కేటీఆర్ కి వివరించారు.

కేసీఆర్ దేశంలో గొప్ప నాయకుడని, ఆయన గొప్ప చరిత్ర భావి తరాల వారికి తెలియాల్సిన అవసరం ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. అంధులకు కూడా కేసీఆర్ జీవిత చరిత్ర తెలిసే విధంగా బ్రెయిలీ లిపిలో పుస్తకాన్ని ముద్రించేందుకు వాసుదేవరెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నారని చెప్పారు. అనంతరం అంధ విద్యార్థులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.