
"ది కేరళ స్టోరీ’ సినిమా హిట్ తో ఊహించని ఫేమ్దక్కించుకుంది అదా శర్మ. పేరుతో పాటు ఈ హీరోయిన్‌పై అదేస్థాయిలో ట్రోలింగ్ కూడా జరుగుతోంది. ఇప్పటికే చంపుతామంటూ ఆమెకు బెదిరింపులు కూడా వచ్చాయి. తాజాగా ఓ ఆగంతకుడు ఆమె పర్సనల్ డేటాను ఇంటర్నెట్లో లీక్ చేశాడు.
‘కేరళ స్టోరీ సినిమా తీశావు కదా ఇప్పుడు ఈ హైదరబాదీ నీ స్టోరీ తీస్తాడు’ అంటూ ఆమె ఫోన్ నంబర్ ఉన్న పోస్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. క్షణాల్లో ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. దీంతో అదా ఫ్యాన్స్ కంగారుపడ్డారు. ఆ వ్యక్తిని హైదరాబాదీగా గుర్తించారు. వెంటనే హైదరాబాద్, ముంబై సైబర్ సెల్స్ కు సమాచారం అందించారు.
అయితే, ఆ యూజర్ అకౌంట్ కొద్దిసేపటికే డీయాక్టివేట్ అయ్యింది. నెటిజన్లు మాత్రం ఈ విషయంలో అదా శర్మకు అండగా నిలుస్తున్నారు. ఇటువంటి క్రూరమైన చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.