
శాంతినగర్, వెలుగు: విద్యుత్ షాక్ తో రైతు మృతి చెందిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగింది. స్థానికులు తెలిపిన ప్రకారం.. రాజోలి మండలం తుమ్మలపల్లికి చెందిన సోమేశ్వర్ రెడ్డి, జయంతి దంపతులకు ఇద్దరు కొడుకులు. కాగా చిన్న కొడుకు శివారెడ్డి (28), వ్యవసాయం చేస్తుంటాడు. ఆదివారం పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి మోటర్ ను ఆన్ చేయగా విద్యుత్ షాక్ కొట్టి కుప్పకూలిపడిపోయాడు.
రైతులు, గడ్డి కోస్తున్న మహిళలు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కర్నూలు ఆస్పత్రికి తరలించగా..అతడు అప్పటికే చనిపోయినట్టు డాక్టర్లు తెలిపారు. శివారెడ్డి మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. మృతుడికి భార్య వాణి, కొడుకు ఉన్నారు.