వీరశైవ లింగాయత్‌‌‌‌లను ఓబీసీలో చేర్చండి

వీరశైవ లింగాయత్‌‌‌‌లను ఓబీసీలో చేర్చండి

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో వీరశైవ లింగాయత్/వీరశైవ లింగాయత్ బలిజతో పాటు ఇతర 30 కులాలు, ఉప కులాలను ఓబీసీ జాబితాలో చేర్చాలని నేషనల్ బీసీ కమిషన్(ఎన్‌‌‌‌బీసీ)కు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విజ్ఞప్తి చేశారు. గురువారం ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్‌‌‌‌లో ఎన్‌‌‌‌బీసీ చైర్మన్ హన్స్‌‌‌‌రాజ్ అహీర్‌‌‌‌‌‌‌‌తో ఆయన భేటీ అయ్యారు. రాష్ట్రంలో వీరంతా బీసీ జాబితాలో  ఉన్నా.. కేంద్రంలోని ఓబీసీ జాబితాలో లేరన్నారు. ప్రధాని మోడీ బీసీలకు కోసం ప్రవేశపెట్టిన మత్స్య సంపద, విశ్వకర్మలకు ప్రోత్సాహకాలు వంటి అనేక కేంద్ర స్కీమ్‌‌‌‌లు ఈ కులాలు పొందడం లేదన్నారు. దీంతో ఈ వర్గాలను ఓబీసీ జాబితాలో చేర్చాలని కోరారు. దీనిపై హన్స్‌‌‌‌రాజ్ సానుకూలంగా స్పందించినట్లు లక్ష్మణ్ తెలిపారు. కాగా, తెలంగాణ రాష్ట్రంలోని బీసీలుగా ఉండి కేంద్ర జాబితాలో లేని లింగాయత్, ఆరే మరాఠాలతో పాటు పలు కులాలను ఓబీసీ జాబితాలో ప్రధాని మోడీ ప్రభుత్వం చేర్చుతుందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప అన్నారు. దీనికి సంబంధించి తాము కమిషన్ చైర్మన్‌‌‌‌కు వివరించామని, త్వరలోనే ఈ వర్గాలు ఓబీసీలో జాబితాలో చేరడం ఖాయమని చైర్మన్ హన్స్‌‌‌‌రాజ్ హామీ ఇచ్చారని చెప్పారు. ‌‌‌‌

హన్స్‌‌‌‌రాజ్‌‌‌‌తో ఎంపీ బీబీ పాటిల్‌‌‌‌ భేటీ..

నేషనల్‌‌‌‌ బీసీ కమిషన్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ హన్స్‌‌‌‌రాజ్‌‌‌‌తో తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మెంబర్ శుభప్రద్ పటేల్, ఎంపీ బీబీ పాటిల్ ఢిల్లీలో భేటీ అయ్యారు. వీరశైవ లింగాయత్‌‌‌‌లను ఓబీసీలో చేర్చాలని కోరుతూ వారు హన్స్‌‌‌‌రాజ్‌‌‌‌కు వినతి పత్రం అందజేశారు. తెలంగాణలో బీసీ జాబితాలో ఉన్న వీరశైవ లింగాయత్‌‌‌‌లను కేంద్రంలోని ఓబీసీ జాబితాలో చేర్చకపోవడంతో వారు విద్య, ఉద్యోగావకాశాలు కోల్పోతున్నారని శుభప్రద్‌‌‌‌ పటేల్‌‌‌‌ అన్నారు. ఈ వర్గాలను ఓబీసీ జాబితాలో చేర్చి న్యాయం చేయాలని కోరారు. తమ విజ్ఞప్తికి ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఈ అంశంపై ఒక నివేదికను తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తామని హన్స్‌‌‌‌రాజ్‌‌‌‌ హామీ ఇచ్చారన్నారు. ఎన్‌‌‌‌బీసీ చైర్మన్‌‌‌‌ను కలిసిన వారిలో ఉమాకాంత్ పాటిల్, మల్లికార్జున్ పాటిల్, నేతి మహేశ్వర్ మధుశేఖర్, శంకర్ పటేల్, వీరాశైవ లింగాయత్ సంఘాల నేతలు ఉన్నారు.