
తిరువనంతపురం: కేరళ సీఎం ఇంట్లో బాంబు పెట్టామని ఆదివారం (జూలై13) బెదిరింపులు వచ్చాయి. కేరళ సీఎం పినరయి విజయన్ అధికారిక నివాసం క్లిఫ్ హౌస్ కు బాంబు పెట్టామని తుపానూర్ పోలీస్ స్టేషన్ కు ఈమెయిల్ ద్వారా బెదిరింపు మేసేజ్ వచ్చింది. అది ఎవరి ద్వారా వచ్చిందో ఇంకా గుర్తించలేదని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
క్లిఫ్ హౌస్ దగ్గర బాంబు పేలుళ్లు జరగబోతున్నాం అని పోలీసులకు మేసేజ్ పంపించారు గుర్తుతెలియని వ్యక్తులు. అప్రమత్తమైన పోలీసులుసెర్చింగ్ నిర్వహించారు. డాగ్ ,బాంబ్ స్క్వాడ్ల తో విస్తృతంగా తనిఖీలు చేశారు. ఈతనిఖీల్లో ఎటువంటి అనుమానాస్పదం వస్తువులు దొరకలేదని పోలీసులు తెలిపారు.
సోదాలు జరిగిన సమయంలో సీఎం విజయన్, ఆయన కుటుంబం విదేశాల్లో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కీలక సంస్థలను లక్ష్యంగా చేసుకుని ఇటీవల వచ్చిన బాంబు బెదిరింపులకు ఈ బెదిరింపు సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది.