తెలంగాణ బీఆర్‌‌ఎస్​ పాలనలో సమ్మిళిత అభివృద్ధి

తెలంగాణ బీఆర్‌‌ఎస్​ పాలనలో సమ్మిళిత అభివృద్ధి

నిజామాబాద్​అర్బన్, వెలుగు: సీఎం కేసీఆర్ ​నాయకత్వంలోని బీఆర్ఎస్​ పాలనలో రాష్ట్రంలోని అన్ని రంగాలు అభివృద్ధి చెందాయని అర్బన్​ఎమ్మెల్యే, బీఆర్ఎస్​అభ్యర్థి బిగాల గణేశ్​ గుప్తా పేర్కొన్నారు. సోమవారం అర్బన్​సెగ్మెంట్​లోని వివిధ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం రియల్​ఎస్టేస్​అసోసియేషన్, గ్లోబల్​ కోఆర్డినేటర్ సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశాల్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గణేశ్​గుప్తా మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యేగా ఉన్న తొమ్మిదేండ్ల కాలంలో ఇందూరులో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశానని, ప్రతి పేదవాడి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా కృషిచేశానన్నారు. ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు చేస్తున్న విషప్రచారాన్ని నమ్మకండా మరోసారి తనను ఆశీర్వదించాలని కోరారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ హవా నడుస్తోందని, మూడోసారి అధికారంలో రావడం గ్యారంటీ అన్నారు. కాంగ్రెస్​ఎమ్మెల్యే అభ్యర్థులకే గ్యారంటీ లేదని, ఇక వారిచ్చే గ్యారంటీలను ఎవరు నమ్ముతారని ఎద్దేవా చేశారు.