ఇంటర్ ఎగ్జామ్ ఫీజు గడువు 28 వరకు పెంపు

ఇంటర్ ఎగ్జామ్ ఫీజు గడువు 28 వరకు పెంపు

హైదరాబాద్,వెలుగు: ఇంటర్ పరీక్షల ఫీజు గడువును ఫైన్​తో ఈ నెల 28 వరకు పెంచినట్టు ఇంటర్ బోర్డు తెలిపింది. రూ.4వేల ఫైన్​తో ఈ నెల 26 నుంచి 28దాకా స్టూడెంట్లతో పాటు ప్రిన్సిపల్స్​ కూడా ఫీజును చెల్లించాలని ఎగ్జామినేషన్ కంట్రోలర్ మహమ్మద్ ఖలీక్​ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రూ.3 వేల ఫైన్​తో ఈ నెల10న గడువు ముగిసింది. అయితే కొంతమంది స్టూడెంట్లు, పేరెంట్స్ ఫీజు గడువు పెంచాలని ఇంటర్ బోర్డుకు వస్తుండటంతో మరో 3 రోజులు పెంచుతూ బోర్డు ఉత్తర్వులిచ్చింది.