ఇంకా పెరగనున్నఎండలు…

ఇంకా పెరగనున్నఎండలు…

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే సాధారణం కంటే 4 డిగ్రీలు టెంపరేచర్ పెరిగిపోయింది. పగలంతా రోళ్లు పగిలే ఎండలు కాస్తుంటే, రాత్రుళ్లు ఉక్కపోత చుక్కలు చూపిస్తోంది. దీంతో కూలర్లు, ఏసీల గదుల్లోంచి బయటకు రావడానికి జనం జంకుతున్నారు. జగిత్యాల జిల్లా ఐలపూర్‌‌లో సోమవారం అత్యధికంగా 45.7 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది.

ఉపరితల ద్రోణి.. వడగాల్పులు..

పశ్చిమ బెంగాల్ నుంచి దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక వరకు దక్షిణ ఛత్తీస్‌‌గఢ్, తెలంగాణ మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి ఏర్పడిందని వాతావరణ సంస్థ తెలిపింది. ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక, దాని పరిసర ప్రాంతాల్లో 0.9 కి.మీ. ఎత్తులో, దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక, రాయలసీమ ప్రాంతాల్లో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వెల్లడించింది. రాష్ట్రంలో మంగళవారం అక్కడక్కడా తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని, మరి కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీస్తాయని అంచనా వేసింది.