ఎఫ్ఆర్బీఎం పరిమితి 5శాతానికి పెంపు

ఎఫ్ఆర్బీఎం పరిమితి 5శాతానికి పెంపు

హైదరాబాద్, వెలుగు:రాష్ట్రం తీసుకునే అప్పుల పరిమితిని జీఎస్డీపీలో3 నుంచి 5శాతానికి పెంచుతూ మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అనుమతితో న్యాయశాఖ కార్యదర్శి సంతోష్ రెడ్డి ఈ ఆర్డినెన్స్ జారీ చేశారు. కరోనా కారణంగా రాష్ట్ర ఎకానమీ తీవ్రంగా దెబ్బతిందని, అప్పులు తీసుకునే పరిమితిని పెంచాలని సీఎం కేసీఆర్ తో పాటు దేశంలోని అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానిని కోరారు. రాష్ట్రాలు అప్పులు తీసుకునే పరిమితిని జీఎస్డీపీలో 5శాతం పెంచేందుకు కేంద్రం కొన్ని షరతులతో ఓకే చెప్పింది. ఈజ్ఆఫ్ డూయింగ్ బిజినెస్, వన్ నేషన్ వన్ రేషన్, మున్సిపల్ రిఫార్మ్స్ లో మన రాష్ట్రం మెరుగైన స్థితిలో ఉండడంతో ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చింది.