సెల్​ ఫోన్లు, స్పేర్​ పార్ట్స్ రేట్లు పెరిగినయ్

సెల్​ ఫోన్లు, స్పేర్​ పార్ట్స్ రేట్లు పెరిగినయ్
  •                 మునపటిలా కనిపించని గిరాకీ
  •                 డీలా పడుతున్న వ్యాపారులు
  •                 మొబైల్​ మార్కెట్లపై జీఎస్టీ ఎఫెక్ట్​

లాక్​డౌన్ ​సడలింపులతో కొత్త మొబైల్స్​ కొందామనుకున్న వాళ్లూ, రిపేర్​ చేయించుకునేందుకు వెళ్తున్న వాళ్లకు పెరిగిన ధరలు షాక్​ ఇస్తున్నాయి. ఏప్రిల్ 1 నుంచి కొత్త జీఎస్టీ విధానం అమల్లోకి రావడంతో సెల్ ఫోన్లు, స్పేర్ పార్ట్స్​ రేట్లు బాగా పెరిగాయి. గతంలో ఉన్న జీఎస్టీ12 నుంచి 18 శాతానికి పెరగడంతో కంపెనీలూ ధరలు పెంచేశాయి. నార్మల్​ డేస్​లో కిటకిటలాడే జగదీశ్​మార్కెట్, గుజరాతీ గల్లీల్లో కస్టమర్లు పెద్దగా కనపడడం లేదు. సరి-–బేసి సిస్టమ్​లో షాపులు తెరుస్తున్నా , రేట్లు పెరగడంతో ఇంట్రెస్ట్​ చూపడం లేదని వ్యాపారులు చెప్తున్నారు. మార్కెట్​మొత్తం డీలా పడిందంటున్నారు.

స్పేర్​ పార్ట్స్ షార్టేజ్

కరోనా ఎఫెక్ట్​తో లాక్​డౌన్​కు ముందే చైనా నుంచి మొబైల్​ స్పేర్​ పార్ట్స్​ సప్లయ్​ ఆగిపోయింది. ఎక్కువ డిమాండ్​ ఉన్నవి  మార్కెట్లో దొరకడం లేదు. ఇంకా టైం పడుతుందని షాప్ ఓనర్లు చెప్తున్నారు. జీఎస్టీ ప్రభావం, షార్టేజ్ కారణంగా 3 నెలల క్రితం ఉన్న రేట్లతో పోలిస్తే ఇప్పుడు 25 నుంచి 40 శాతం పెరిగాయి.

కూర్చుని మాట్లాడుకుందాం..కోర్టులకెందుకు