పెరిగిన బంగారం  దిగుమతులు

పెరిగిన బంగారం  దిగుమతులు

న్యూఢిల్లీ: మనదేశం గత నెలలో 91 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంది. గత సంవత్సరం సెప్టెంబరులో కొన్న 12 టన్నులతో పోలిస్తే ఈ సెప్టెంబరులో దిగుమతులు 658 శాతం పెరిగాయి.  బంగారం ధరలు దాదాపు ఆరు నెలల కనిష్ట స్థాయికి చేరుకోవడంతో డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌ పెరిగింది. నగల వ్యాపారులు  పండుగ సీజన్‌‌‌‌ కోసం భారీగా పసిడిని కొన్నారు.  2020 సెప్టెంబర్ దిగుమతుల విలువ 601 మిలియన్ డాలర్లు కాగా, ఈ ఏడాది సెప్టెంబరులో వీటి విలువ 5.1 బిలియన్‌ డాలర్లకు పెరిగింది.