ఆర్టీసీలో అడ్డగోలుగా డ్యూటీలు..జీతాల్లో కోతలు

ఆర్టీసీలో అడ్డగోలుగా డ్యూటీలు..జీతాల్లో కోతలు

యూనియన్లను రానిస్తలే.. వెల్ఫేర్‌ కౌన్సిల్స్‌ పనిచేస్తలే
కరోనాతో చస్తున్నా కనికరించేవారే లేరు
ఉద్యోగులపై పెరిగిన వేధింపులు

హైదరాబాద్‌‌, వెలుగు: సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఆర్సీలో టీ తీసుకొచ్చిన వెల్ఫేర్ కౌన్సిల్స్ సరిగ్గా పనిచేస్తలేవు. కౌన్సిళ్లు సకాలంలో సమావేశం కావడంలేదు. కంప్లయింట్ బాక్స్ ద్వారా ఎన్ని ఫిర్యాదు లు, వినతులు వచ్చినా పట్టించుకునేవారే కరువయ్యారు. గతంలో ఉద్యోగులు యూనియన్లకు మొరపెట్టుకుని సమస్యలను పరిష్కరించుకునే వాళ్లు. ఇప్పుడు తమ కష్టాలు ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూనియన్లను బలహీనపరచడంతో అడిగేవారు లేక అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నా యి. డ్రైవర్లు, కండక్టర్ల‌కు డ్యూటీలు వేయకున్నా.. ఆబ్సెంట్ వేసి కార్మికుల జీతాల్లో కోతలు పెట్టినా అడిగే వాళ్లు లేరని బాధపడుతున్నారు. కరోనాతో చస్తున్నా ధైర్యం చెప్పేటోళ్లే లేరని మదనపడుతున్నారు.

యూనియన్ల ప్లేస్‌లో వెల్ఫేర్‌‌ కౌన్సిళ్లు..

ఆర్సీలో టీ 49 వేల మంది వరకు ఉద్యోగులున్నారు. యూనియన్ల ప్లేస్‌లో ఈ ఏడాది ఫిబ్రవరిలో కొత్తగా వెల్ఫేర్ ‌‌కౌన్సిళ్ల‌ను ఏర్పాటు చేశారు. డిపోకు నలుగురు చొప్పున సభ్యులను నియమించారు. ప్రతి డిపోలో ఫిర్యాదుల బాక్స్‌‌ను తెచ్చారు. కార్మికులు..యూనియన్ల జోలికి పోకుండా తమ సమస్యలు, ఫిర్యాదులు, వినతులు, విజ్ఞప్తులు, రాసి ఫిర్యాదు బాక్సుల్లో వేయాలి. వారంలో చివరి రోజు కమిటీ సభ్యులు సమావేశమై వీటిని పరిశీలిస్తారు. అందులో పరిష్కరించేవి డిపోలో మేనేజర్‌‌స్థాయిలో పరిష్కరిస్తారు. రీజియన్‌ స్థాయిలో ఉంటే రీజినల్‌ మేనేజర్‌‌కు, రాష్ట్ర స్థాయిలో ఉంటే బస్‌ భవన్‌కు పంపిస్తారు. తర్వాత ఉన్నతాధికారులు రివ్యూ చేసి, సమస్యలను పరిష్కరిస్తారు. వీటిని పర్యవేక్షించడానికి బస్‌భవన్‌లో మానిటరింగ్‌‌ సెల్‌‌ కూడా ఏర్పాటు చేశారు.

కౌన్సిళ్ల మీటింగులు బంద్..

వెల్ఫేర్ కౌన్సిళ్ల‌లో రిజర్వేషన్‌ ప్రకారం ఆర్టీసీ అధికారులనే నియమించారు. కనీస పరిజ్ఞానం లేనోళ్ల‌ను కూడా బోర్డులో సభ్యులుగా నియమించారని ఉద్యోగులు పెదవి విరిచారు. మొదట్లో కొంత బాగానే ఉన్నా.. ఆ తర్వాత ఇది గాడి తప్పింది. లాక్‌‌డౌన్ తర్వాత మూడు నెలలుగా వెల్ఫేర్‌ కౌన్సిళ్లు పని చేయడంలేదు. చాలా డిపోల్లో మీటింగ్ లు బంద్‌ చేశారు. సమస్యలపై ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడంలేదని ఉద్యోగులు వాపోతున్నారు. లెటర్స్‌‌ను డిపో లెవెల్‌‌లోనే క్లోజ్‌‌ చేసేస్తున్నారని అంటున్నారు.
సీసీఎస్‌ డబ్బులూ ఇయ్యలె..
ఆర్టీసీ ఉద్యోగుల పిల్లల చదువులు, పెళ్ళ్లిలు, ఇళ్లు కట్టుకోవటం తదితర అవసరాలకు సీసీఎస్‌ నుంచి లోన్లు తీసుకుంటారు. ఉద్యోగుల వేతనంలో నెలనెలా కొంత శాతం సీసీఎస్‌కు కట్ ‌‌అవుతుంది. ఆ డబ్బును ఆర్టీసీ మేనేజ్‌‌మెంట్ ‌‌సీసీఎస్ ఖాతాకు ట్రాన్స్‌‌ఫర్ ‌‌చేయాలి. అయితే ఈ డబ్బులను 600 కోట్ల వరకు ఆర్టీసీ సొంతానికి వాడుకుంది. సమ్మె టైంలో 200 కోట్లను చెల్లించాలని హైకోర్టు ఆదేశించినా ఇప్పటికీ చిల్లి గవ్వ ఇవ్వలేదు. లాక్‌‌డౌన్‌తో మూడు నెలలపాటు సగం జీతాలే ఇచ్చారు. ఆబ్సెంట్లు వేయడంతో వేలమందికి 10వేల లోపే జీతాలు వచ్చాయి. అనేక మంది సీసీఎస్‌లోన్లకు దరఖాస్తు చేసుకున్నాడబ్బులు లేకపోవడంతో 12 వేల అప్లికేషన్లు పెండింగ్‌ లో ఉన్నాయి. లాక్డౌన్‌లో కూడా లోన్లు ఇవ్వకపోడంతో చాలామంది సీసీఎస్ నుంచి డ్రాప్‌‌ అవుతున్నారు.

ఆర్టీసీలో ఉద్యోగుల గోడు ..అధికారుల ఇష్టారాజ్యం..

గతంలో యూనియన్లు ఉన్నప్పుడు ఆఫీసర్లు చాలా భయంతో పనిచేసేవారు. అనేక సందర్భాల్లోయూనియన్లు చెప్పిందే ఫైనల్‌ అయ్యేది. కానీ ఇప్పుడు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కొన్నిచోట్ల యూనియన్ లీడర్ల‌ను ఇతర ప్రాంతాలకు బదిలీ చేశారు. దీంతో యూనియన్లు, లీడర్లు లేకపోవడంతో డిపోల్లో ఆర్టీసీ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఎంతలా అంటే కనీసం అధికారి అడిగిన ప్రశ్నకు ఉద్యోగి సమాధానం చెప్పినా ట్రాన్స్‌‌ఫర్ లేదా స్పేర్‌‌ పెడుతున్నారు. ఇలాగే కరీంనగర్‌ డిపో వన్‌ పరిధిలో ఓ ఉద్యోగిని 5 నెలలుగా స్పేర్‌‌ లో పెట్టారు. లాక్డౌన్ తర్వాత వారానికి మూడు రోజులే డ్యూటీలు ఇస్తున్నారు. డ్యూటీలకు వచ్చినా ఆబ్సెంట్ వేస్తూ.. జీతాల్లో భారీగా కోతలు పెడుతున్నరు. బస్సుల్లో మాస్కులు, శానిటైజర్లు సైతం ఇవ్వడంలేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం..